'స్లమ్ డాగ్ మిలియనీర్' దేవ్ పటేల్ మూవీ నిషేధం?
అయితే అతడు నటించిన తాజా చిత్రం 'మంకీ మ్యాన్' ఇండియా రిలీజ్ ఇబ్బందుల్లో పడడం అభిమానుల్లో చర్చగా మారింది
స్లమ్ డాగ్ మిలియనీర్ లాంటి ఆస్కార్ విన్నింగ్ మూవీలో నటించిన దేవ్ పటేల్ ఆ తర్వాత బాలీవుడ్ సహా హాలీవుడ్ లోను పలు చిత్రాల్లో నటించాడు. అతడి నటన, ఆల్ రౌండర్ నైపుణ్యానికి గొప్ప పేరొచ్చింది. బాలీవుడ్ లో ఎందరు స్టార్లు ఉన్నా కానీ దేవ్ తనదైన ఒరవడితో ముందుకు సాగుతున్నాడు. అయితే అతడు నటించిన తాజా చిత్రం 'మంకీ మ్యాన్' ఇండియా రిలీజ్ ఇబ్బందుల్లో పడడం అభిమానుల్లో చర్చగా మారింది.
దేవ్ నటించిన 'మంకీ మ్యాన్' నిజానికి ఏప్రిల్‌లో వార్తల్లో నిలిచింది. ఎందుకంటే అభ్యంతరకర సన్నివేశాల కారణంగా ఈ సినిమాను భారతదేశంలో విడుదల చేయడానికి అనుమతి లభించలేదు. ఇప్పుడు రెండు నెలల తర్వాత కూడా ఈ సినిమా అస్పష్టంగా ఉందని రిలీజ్ కి అడ్డంకులు తొలగలేదని కథనాలొస్తున్నాయి. మీడియా కథనాల ప్రకారం ..సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అడ్వైజరీ ప్యానెల్ అధికారికంగా నిషేధించకుండా విడుదలను అడ్డుకుంది. ఎగ్జామినింగ్ కమిటీ కోసం సినిమా ప్రదర్శనను CBFC ఉద్దేశపూర్వకంగానే తప్పించిందని ఒక ప్రముఖ మీడియా పోర్టల్ పేర్కొందని జాతీయ మీడియా తన కథనంలో ప్రచురించింది.
ఎందుకు రిలీజ్ ఆగింది?
ఈ చిత్రం భారతదేశంలో ఏప్రిల్ 19న విడుదల కావాల్సి ఉంది. మతం రాజకీయాల మధ్య అనుబంధాన్ని నొక్కిచెప్పే సన్నివేశాలు ఇబ్బందికరంగా ఉన్నాయని ఫిర్యాదు అందగా, యూనివర్సల్ స్టూడియోస్ మార్పులు చేసింది. రాజకీయ బ్యానర్ల రంగును కూడా కుంకుమ నుంచి ఎరుపు రంగులోకి మార్చారు.
సినిమాటోగ్రాఫ్ (సర్టిఫికేషన్) రూల్స్ ప్రకారం.. మార్చిలో నోటిఫై చేసిన మూవీ నేపథ్యం 1983 వెర్షన్‌లో ఉన్నది. ఎగ్జామినింగ్ కమిటీకి రిఫర్ చేయడానికి సినిమాకి ఐదు రోజుల గడువు ఉంది. ఈ గడువు మే నెలలో ముగిసిపోయినప్పటికీ సెన్సార్ వారు ఎగ్జామినింగ్ ఆఫీసర్లకు ఈ చిత్రాన్ని ప్రదర్శించలేదని కథనాలొస్తున్నాయి.
దేవ్ పటేల్ స్వీయదర్శకత్వంలో నిర్మించిన అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మంకీ మ్యాన్ లో శోభితా ధూళిపాలా, షార్ట్ లో కోప్లీ, పిటోబాష్, విపిన్ శర్మ సహాయక పాత్రల్లో నటించారు. అవినీతి అధికారులు, అవ్యవస్థకు కారకులపై ప్రతీకారం తీర్చుకునే అటవీ గ్రామస్థుడి పాత్రలో దేవ్ ఇందులో నటించాడు. ఒక అనామక యువకుడు తన తల్లిని హత్య చేసిన అవినీతి నాయకులపై ప్రతీకారానికి సిద్ధమయ్యాక ఏం జరిగిందన్నది తెరపైనే చూడాలి. పేద వారు.. శక్తి లేనివారిని క్రమపద్ధతిలో బలిపశువులను చేస్తూనే ఉండే అధికారులపై దాడి ఎలా జరిగిందన్నదే ఈ సినిమా థీమ్. ఇప్పటికే ట్రైలర్ లో ఇలాంటి ఎన్నో ఆసక్తికర ఎలిమెంట్స్ ని చూపించిన సంగతి తెలిసిందే.
మంకీ మ్యాన్‌ని ఎక్కడ చూడాలి?
మంకీ మ్యాన్ ప్రస్తుతం పీకాక్ టీవీలో ప్రసారం అవుతోంది. ఈ చిత్రం 14 జూన్ 2024 శుక్రవారం నుంచి పీకాక్ స్ట్రీమింగ్ సర్వీస్‌లో అందుబాటులో ఉంది.