హనుమాన్ రూట్లో హాలీవుడ్ మూవీ.. స్టన్నింగ్ ట్రైలర్

ట్రైలర్ ప్రకారం.. ఇండియన్ నేపథ్యంలో సాగుతుంది ఈ సినిమా. చిన్నప్పుడు కాస్ట్ సిస్టిమ్ తో అనేక కష్టాలు ఎదుర్కొంటాడు హీరో.

Update: 2024-01-27 05:51 GMT

హాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన బ్యాట్ మ్యాన్ సినిమాల్లో కొన్ని సన్నివేశాలకు, అవతార్ కు మన రామాయణం స్ఫూర్తి అని చాలా మంది చెబుతుంటారు. అక్కడి సినిమాల్లో ఎక్కువగా గ్రీస్, రోమ్ సంస్కృతి కనబడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడిప్పుడు భారతీయ దేవుళ్ల మీద దృష్టి సారిస్తున్నట్టు ఉన్నారు. ఆ మధ్య సూపర్ హీరో మూవీ.. ఫ్లాష్ లో హిందువులు భక్తి శ్రద్ధలతో కొలిచే హనుమంతుడి ఫొటో కనిపించింది.

ఇప్పుడు హనుమంతుడి ఇన్స్పిరేషన్ తో ఏకంగా మంకీ మ్యాన్ సినిమానే తెరకెక్కింది. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు దేవ్ పటేల్ లీడ్ రోల్ పోషించారు. అంతేకాకుండా ఈ చిత్రానికి దర్శక, నిర్మాత బాధ్యతలు కూడా ఆయనే వ్యవహరించారు. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.

ట్రైలర్ ప్రకారం.. ఇండియన్ నేపథ్యంలో సాగుతుంది ఈ సినిమా. చిన్నప్పుడు కాస్ట్ సిస్టిమ్ తో అనేక కష్టాలు ఎదుర్కొంటాడు హీరో. తన ఇల్లును కూడా కోల్పోతాడు. ఆ తర్వాత తన తల్లి చెప్పిన హనుమంతుడి కథలు గుర్తుంచుకుని వాటి ద్వారా ప్రేరణ పొందుతాడు. పెద్దయ్యాక వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకు బాగా కష్టపడి గొరెల్లా మాస్క్ వేసుకుని ఫైటర్ గా మారి పగ తీర్చుకుంటాడు.

అయితే మంకీ మ్యాన్ ట్రైలర్ చాలా ఎఫెక్టివ్ గా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. క్రేజీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని అంటున్నారు. రణ్ బీర్ యానిమల్ మూవీ ట్లైలర్ తర్వాత బెస్ట్ మూవీ ట్రైలర్ ఇదేదని కొనియాడుతున్నారు. జై హనుమాన్ అంటూ షేర్ చేస్తున్నారు.

మరోవైపు, ఈ సినిమాతో తెలుగు అందం శోభితా ధూళిపాళ్ల హాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఇన్ స్టాలో ఓ పోస్ట్ చేసింది. "నా తొలి హాలీవుడ్ చిత్రం మంకీ మ్యాన్ ట్రైలర్‌ను షేర్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల కాబోతుంది" అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమెకు పలువురు ప్రముఖులతోపాటు ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

ఈ మూవీని దేవ్ పటేల్, జోర్డాన్ పీలే, విన్ రోసెన్‌ఫెల్డ్ సహా తదితరులు నిర్మించారు. బ్రాన్ స్టూడియోస్ ప్రొడక్షన్ సహా పలు ప్రముఖ బ్యానర్లపై తెరకెక్కించారు. నిజానికి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో మాత్రమే 2021లో రిలీజ్ చేద్దామనుకున్నారు. ఆ సమయంలో జోర్డాన్ ఈ సినిమాను చూసి.. సిల్వర్ స్క్రీన్ పై విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. మరి హనుమంతుడి స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Full View

Tags:    

Similar News