మోసెస్ మాణిక్‌చంద్ పార్ట్-2.. ఫస్ట్ లుక్‌తో అదిరిపోయే సర్‌ప్రైజ్
ఈ చిత్రానికి బొమ్మ బ్లాక్ బస్టర్ ఫేమ్ రాజ్ విరాట్ దర్శకత్వం వహిస్తున్నారు.
సిద్ధు జొన్నలగడ్డ బ్రదర్ చైతు జొన్నలగడ్డ క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో చైతు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో రాబోతున్న చిత్రం ‘మోసెస్ మాణిక్‌చంద్ పార్ట్-2’. ఈ ప్రాజెక్ట్‌తో చైతు కేవలం హీరోగానే కాకుండా కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రైటర్‌గా కూడా తన ప్రతిభను చాటుకుంటున్నాడు. ఈ చిత్రానికి బొమ్మ బ్లాక్ బస్టర్ ఫేమ్ రాజ్ విరాట్ దర్శకత్వం వహిస్తున్నారు.
రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని ఈ చిత్రం టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు, అలాగే టీమ్‌కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ టైటిల్ ‘మోసెస్ మాణిక్‌చంద్ పార్ట్-2’ డిఫరెంట్ గా ఉండడంతో సోషల్ మీడియాలో గట్టిగానే హైలెట్ అవుతోంది. చిల్డ్రన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో ‘హ్యాపీ నో చిల్డ్రెన్స్ డే’ అని చెప్పడం చాలా కొత్తగా ఉంది.
ఈ పోస్టర్ టైటిల్ డిజైనింగ్ లో మద్యం బాటిల్, క్లాప్ బోర్డ్, అమ్మాయి వైన్ గ్లాస్ వంటి అంశాలు దర్శనమిస్తున్నాయి. ఇవి కథకు సంబంధించి ఒక ప్రత్యేక అర్థాన్ని కలిగించడమే కాకుండా గ్లామర్‌తో కూడిన నైజాన్ని కూడా సూచిస్తున్నాయి. చైతు జొన్నలగడ్డ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రాజ కుర్చీపై ధీమాగా కూర్చొని, స్టైలిష్ హెయిర్ మరియు సన్ గ్లాసెస్‌తో కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు.
అతని ఒంటిమీద గల టాటూలు అతని పాత్ర స్వభావాన్ని బాగా ప్రతిబింబిస్తున్నాయి. భారీ ఆభరణాలు ధరించి, ఆత్మవిశ్వాసం ఉట్టిపడేలా ఉన్న ఈ లుక్‌లో చైతు పాత్రలోని కంటెంట్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ చిత్రం ట్యాగ్‌లైన్ ‘అ రియల్ విలన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దేన్ ఎ ఫేక్ హీరో’ కూడా ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ఈ ట్యాగ్‌లైన్ ద్వారా చైతు పాత్రలోని సంక్లిష్టతను, అతని విలనీ వైపు ఉన్న విలక్షణతను చూపుతోంది. ‘మోసెస్ మాణిక్‌చంద్ పార్ట్-2’ చిత్రం పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.
వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా, కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఈ ప్రాజెక్ట్‌కు వ్యవహరిస్తున్నారు. సిద్దూ జొన్నలగడ్డ అన్న చైతు ప్రధాన పాత్రలో నటించడం మాత్రమే కాకుండా, కథతో పాటు స్క్రీన్‌ప్లేలో కూడా తన వంతు కృషిని చూపించాడు. ఈ చిత్రం ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేయనున్నారు. మరి ఈ సినిమా ఆడియెన్స్ కు ఏ రేంజ్ లో కనెక్ట్ అవుతుందో చూడాలి.