ట్యాలెంటెడ్ నటి ముఖానికి సర్జరీ?
ముఖ్యంగా మౌని ముఖం మారిపోయింది. కంటికింద వలయాలు కనిపిస్తున్నాయి. రూపం పూర్తిగా అదోలా మారింది.;

మౌనిరాయ్ పరిచయం అవసరం లేదు. బుల్లితెర, వెండితెర రెండు చోట్లా భారీ ఫాలోయింగ్ సంపాదించిన మౌనీ, ఇటీవల ప్రియుడిని పెళ్లాడి లైఫ్ లో సెటిలైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాతా తగ్గేదేలే! అంటూ వరుస సినిమాలతో బిజీగా ఉంది మౌనీ.
కానీ ఇప్పుడు ఉన్నట్టుండి మౌనిరాయ్‌లో ఏదో మార్పు ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా మౌని ముఖం మారిపోయింది. కంటికింద వలయాలు కనిపిస్తున్నాయి. రూపం పూర్తిగా అదోలా మారింది. మునుపటి ఛామ్- గ్లో అస్సలు కనిపించడం లేదని నెటిజనులు విమర్శిస్తున్నారు. కొందరు నెటిజనులు హా*గా మారిందని పొగిడేస్తున్నా, చాలా మంది మౌని మరో శస్త్ర చికిత్స చేయించుకుందని కామెంట్ చేస్తున్నారు.
మౌనితో పాటు సోనమ్ బజ్వా, దిశా పటానీ కూడా ఇదే ఫ్రేమ్‌లో కనిపించారు. కానీ ఆ ఇద్దరిలో కనిపించనిది ఏదో మౌనిలో కనిపిస్తోంది. తన రూపం ఆర్టిఫిషియల్ గా మారింది. ముఖాకృతిలో ఏదో మార్పు వచ్చిందని నెటిజనులు గమనించారు. అందుకే కొందరు డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. మౌని - దిశా పటానీ చాలా సన్నిహితులు. వారు చాలాసార్లు కలిసి కనిపించారు. ఇప్పుడు వారితో సోనమ్ బజ్వా కూడా ఈవెంట్లో కలిసి ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.
మౌని రాయ్ తదుపరి భారీ మల్టీస్టారర్ భూత్నీలో నటించింది. సంజయ్ దత్, సన్నీ సింగ్, పాలక్ తివారీ, నిక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హర్రర్-కామెడీ చిత్రం ఏప్రిల్ 18 న విడుదల కానుంది. హర్రర్-కామెడీ కాబట్టి అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మౌనిరాయ్ దీంతో పాటు 'సలాకార్' అనే సినిమాలోను నటిస్తోంది.
మౌని తన కెరీర్‌ను క్యూంకీ సాస్ భీ కభి బహు థి అనే టీవీ షోతో ప్రారంభించింది. తరువాత పలు బుల్లితెర షోలలో కనిపించింది. ఏక్తా కపూర్ సీరియస్ నాగిన్ తన కెరీర్ ని మలుపు తిప్పింది.అక్షయ్ కుమార్ నటించిన గోల్డ్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. మేడ్ ఇన్ చైనా, బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ - శివ తదితర చిత్రాల్లో నటించింది. కేజీఎఫ్ లో మౌని ఐటమ్ నంబర్ లో నర్తించిన సంగతి తెలిసిందే.