'మిస్టర్ బచ్చన్'.. బిజినెస్ గట్టిగానే..
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మిస్టర్ బచ్చన్ మూవీ ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మిస్టర్ బచ్చన్ మూవీ ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మిరపకాయ్ మూవీ తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇదే కావడంతో కాస్త హైప్ నెలకొని ఉంది. కమర్షియల్ డైరెక్టర్ గా హరీష్ శంకర్ కి మంచి పేరుంది. గద్దల కొండ గణేష్ మూవీ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని రెడీ చేస్తున్నారు.
అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మిక్కీ జే మియర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. గద్దల కొండ గణేష్ తర్వాత మరోసారి హరీష్ శంకర్ మిక్కీని మిస్టర్ బచ్చన్ సినిమా కోసం ఎంపిక చేశారు. మిక్కీ జే మియర్ కి గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో సక్సెస్ లో రాలేదు. మరల మిస్టర్ బచ్చన్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఆయన అనుకుంటున్నారు.
అందుకే మాస్ బీట్స్ తో అదిరిపోయే సాంగ్స్ ను ఈ సినిమాకి మిక్కీ అందించారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇప్పటికే మూవీ బిజినెస్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ కలిపి 40 కోట్ల బిజినెస్ ఈ సినిమా పైన జరిగిందని తెలుస్తోంది. రీజనల్ లాంగ్వేజ్ చిత్రంగానే మిస్టర్ బచ్చన్ సినిమా రెడీ అవుతోంది.
ఈ లెక్కన చూసుకుంటే సాలిడ్ బిజినెస్ మిస్టర్ బచ్చన్ పై జరిగిందని చెప్పొచ్చు. మూవీ డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధరకి సొంతం చేసుకుందంట. రవితేజ కెరియర్ లోనే హైయెస్ట్ డిజిటల్ రైట్స్ మిస్టర్ బచ్చన్ కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈగల్ లాంటి డిజాస్టర్ తర్వాత కూడా రవితేజ సినిమాకి 40 కోట్ల బిజినెస్ జరగడం అంటే మామూలు విషయం కాదు.
దీనికి హరీష్ శంకర్ ట్రాక్ రికార్డ్ ఒక రీజన్ అని చెప్పొచ్చు. అలాగే హిందీలో సూపర్ హిట్ అయిన అజయ్ దేవగన్ రైడ్ మూవీకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మూవీపైన కూడా పాజిటివ్ బజ్ ఉంది. రెండు సాంగ్స్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యాయి. రవితేజ సినిమాలు ఫ్లాప్స్ అయిన కూడా ఇప్పటికి అతనికి సాలిడ్ మార్కెట్ ఉంది. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిసి రావడంతో మిస్టర్ బచ్చన్ సినిమాకి మంచి బిజినెస్ జరిగిందంట.