మరోసారి సూపర్ హిట్ జంట..!
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కి టాలీవుడ్ బాగా కలిసి వచ్చింది. తెలుగులో అతను సినిమా చేశాడు అంటే అది సూపర్ హిట్టే అన్న సెంటిమెంట్ ఏర్పడింది.
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కి టాలీవుడ్ బాగా కలిసి వచ్చింది. తెలుగులో అతను సినిమా చేశాడు అంటే అది సూపర్ హిట్టే అన్న సెంటిమెంట్ ఏర్పడింది. మహానటి, సీతారామం తర్వాత లాస్ట్ ఇయర్ రిలీజైన లక్కీ భాస్కర్ సినిమా కూడా ట్రెమండస్ హిట్ అయ్యింది. చిన్నగా తెలుగులో తన మార్కెట్ పెంచుకుంటూ ఇక్కడ స్టార్ హీరోలకు పోటీగా మారుతున్నాడు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ పవన్ సాధినేని డైరెక్షన్ లో ఆకాశంలో ఒక తార సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా సాయి పల్లవిని తీసుకుంటున్నారని తెలుస్తుంది.
ఐతే దుల్కర్ తో మృణాల్ ఠాకూర్ సూపర్ హిట్ జోడీ అనిపించుకుంది. సీతారామం సినిమా కథ కథనాలతో పాటు దుల్కర్, మృణాల్ ల పెయిర్ ఇంప్రెస్ చేసింది. అందుకే మళ్లీ ఆ కాంబోలో ఒక సినిమా చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మృణాల్ కూడా తెలుగులో 3 సినిమాలు చేయగా 2 సూపర్ హిట్ అందుకున్నాయి. ప్రస్తుతం అమ్మడు అడివి శేష్ తో డెకాయిట్ సినిమా చేస్తుంది. ఐతే దుల్కర్ సల్మాన్, మృణాల్ కలిసి నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
ఆకాశంలో ఒక తార సినిమాలో సాయి పల్లవిని తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐతే సాయి పల్లవి వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఒకవేళ ఆమె కాదు అంటే నెక్స్ట్ ఆప్షన్ గా మృణాల్ ఠాకూర్ ని తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఆల్రెడీ హిట్టు కొట్టిన జంట కాబట్టి ఈ జోడీని చూసేందుకు ఆడియన్స్ కూడా ఎగ్జైటింగ్ గా ఉంటారు. తెర మీద హీరో హీరోయిన్ జంట ప్రేక్షకులను మెప్పించగలిగితే చాలు వాళ్లని మళ్లీ మళ్లీ అలా కలిసి చూడాలని కోరతారు.
అలానే దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ ని మళ్లీ మరో సినిమాలో చూడాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మృణాల్ కూడా దుల్కర్ తో స్క్రీన్ షేరింగ్ కి ఆసక్తి కనబరుస్తుంది. ఎలాగు సూపర్ హిట్ జోడీ కాబట్టి ఈ కలయికలో సినిమా వస్తే మరో సూపర్ హిట్ పక్కా అనే ఆలోచనలో ఉన్నారు. సందీప్ గుణ్ణం ప్రొడ్యూస్ చేస్తున్న ఆకాశంలో ఒక తార సినిమా ఆల్రెడీ సెట్స్ మీద ఉన్నట్టు తెలుస్తుంది. సినిమాను చాలా సైలెంట్ గా షూట్ చేస్తున్నట్టు టాక్.