ఈ వెయిటింగ్ దేనికోసం అమ్మడు..?
రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మృణాల్ అదరగొట్టగా ఇక టాలీవుడ్ లో అమ్మడికి తిరుగులేదని అనుకున్నారు.;

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మెప్పించిన బ్యూటీ మృణాల్ ఠాకూర్ అంతకుముందు బాలీవుడ్ సీరియల్స్ తో పాటు సినిమాలు కూడా చేసినా రాని క్రేజ్ అమ్మడికి సీతారామం తో వచ్చింది. సినిమాలో సీతామహాలక్ష్మి, నూర్జహాన్ పాత్రల్లో మృణాల్ అదరగొట్టేసింది. టాలీవుడ్ కి మరో స్టార్ హీరోయిన్ వచ్చిందని అందరు ఫిక్స్ అయ్యారు. సీతారామం తర్వాత నానితో హాయ్ నాన్న సినిమా చేసింది అమ్మడు. ఆ సినిమాలో కూడా తన నటనతో ఇంప్రెస్ చేసింది. రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మృణాల్ అదరగొట్టగా ఇక టాలీవుడ్ లో అమ్మడికి తిరుగులేదని అనుకున్నారు.
కానీ విజయ్ దేవరకొండతో చేసిన ఫ్యామిలీ స్టార్ సినిమా డిజప్పాయింట్ చేసింది. ఆ సినిమా హిట్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల మృణాల్ కెరీర్ రిస్క్ లో పడింది. రెండు హిట్లు పడినప్పుడు కాదు ఒక్క ఫ్లాప్ పడగానే బ్యాడ్ లక్ వెంటాడుతుంది. అందుకే తెలుగులో అమ్మడికి చేతిదాకా వచ్చిన సినిమాలు చేజారిపోయాయి.
పోనీ బాలీవుడ్ లో ఏమైనా వరుస ఆఫర్లు ఉన్నాయా అంటే అక్కడ అరకొర అవకాశాలే తప్ప పెద్దగా ఛాన్స్ లు రావట్లేదు. ఐతే తెలుగులో కొన్ని ఆఫర్లు వస్తున్నా కూడా మృణాల్ వాటిని వెయిటింగ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. మరి కెరీర్ అటు ఇటుగా ఉన్నప్పుడు కూడా ఈ వెయిటింగ్ లు గట్రా దేనికన్నది అర్థం కావట్లేదు. ఐతే ఒక ఆఫర్ కి ఓకే చెప్పాక దానికంటే బెటర్ ఆఫర్ వస్తే కష్టం కదా అని మృణాల్ భావిస్తుంది.
ఐతే అలా వెయిట్ చేస్తూ ఆఫర్లను హోల్డ్ లో పెడుతూ వస్తే ఇక ఉన్న ఆ ఒక్క ఛాన్స్ కూడా చేజారే అవకాశం ఉంటుంది. కథల విషయంలో నచ్చక వెయిట్ చేయడం మంచి విధానమే కానీ మరీ మృణాల్ ఠాకూర్ ఇలా రెండు హిట్లు ఒక ఫ్లాప్ పడగానే డీలా పడిపోవడం ఆమె ఫ్యాన్స్ ని కన్ ఫ్యూజ్ చేస్తుంది.
మృణాల్ మళ్లీ తిరిగి తెలుగులో వరుస సినిమాలు చేయాలని ఆమె ఫాలోవర్స్ కోరుతున్నారు. ఐతే సినిమాల పరంగా దూరంగా ఉంటున్నా అమ్మడు ఫోటో షూట్స్ తో ఆడియన్స్ కు రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటుంది. తప్పకుండా మృణాల్ కి మళ్లీ మంచి అవకాశాలు రావాలని ఆమె ని ఇష్టపడే ఆడియన్స్ కోరుతున్నారు.