పవన్ - తారక్‌లతో ఛాన్సే లేదు!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలతో తన అభిమానుల ముందుకు రానున్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలతో తన అభిమానుల ముందుకు రానున్నారు. ఇంతలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి పాన్ ఇండియన్ చిత్రం గురించి ప్రకటించేందుకు ఆసక్తిగా ఉన్నాడు. టాలీవుడ్ లో ఇద్దరు పవర్ హౌస్ ల గురించి చెప్పేదేం ఉంది.
అయితే ఇప్పుడు ఆ ఇద్దరు హీరోలతో నటించాలనుందని ప్రతిభావంతురాలైన మృణాల్ ఠాకూర్ తన ఆకాంక్షను వెలిబుచ్చింది. అయితే మృణాల్ కి అంత సీనుందా? అంటే అందుకు ఛాన్సే లేదు. మృణాల్ ఇప్పటివరకూ నాని, విజయ దేవర కొండ వంటి హీరోలతో అవకాశాలు అందుకుంది. మరో మెట్టు ఎక్కాలంటే కచ్ఛితంగా పాన్ ఇండియన్ స్టార్లు ఎన్టీఆర్, పవన్, రామ్ చరణ్, బన్ని వంటి స్టార్లు అవకాశం కల్పించాల్సి ఉంది.
ఇలంటి సమయంలో పవన్, ఎన్టీఆర్ ల సరసన అవకాశం కావాలని ఆశపడుతోంది. అయితే ఆ ఇద్దరు స్టార్లు అవకాశం కల్పించడం అంటే అంత సులువైన విషయం కాదు. చాలా విషయాలను పరిగణనలోకి తీసుకుని ఓకే చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అడివి శేష్ సరసన డెకాయిట్ లో నటిస్తున్న ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో మరో అవకాశం లేదు. మృణాల్ తనకు పెద్ద హీరోలు అవకాశాలు కల్పిస్తారనే ఆశతో ఉంది. కానీ అది సాధ్యపడుతుందా లేదా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.