అది మిస్సైంది.. ఈ ఛాన్స్ పట్టేసుకుంది..!

అసలైతే సూర్య నటించిన ప్రతిష్టాత్మక సినిమా కంగువలోనే మృణాల్ ని తీసుకోవాలని అనుకున్నారు.

Update: 2024-10-26 05:01 GMT

సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ మృణాల్ ఠాకూర్. అంతకుముందు బాలీవుడ్ సీరియల్స్, సినిమాలు చేసిన మృణాల్ ఠాకూర్ సీతారామంలో చేసిన నూర్జహాన్, సీతామహాలక్ష్మి పాత్రలకు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. తెలుగు ఆడియన్స్ ఒకసారి ఇష్టపడితే ఆ రేంజ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. సీతారామం హిట్ తర్వాత నానితో హాయ్ నాన్న సినిమాలో నటించింది మృణాల్ అది కూడా సక్సెస్ అందుకోగా ఇక తెలుగులో మృణాల్ కి తిరుగు లేదని అనుకున్నారు.


కానీ విజయ్ దేవరకొండతో చేసిన ఫ్యామిలీ స్టార్ షాక్ ఇవ్వడం వల్ల అమ్మడు వెనకబడింది. ఎన్ని హిట్ ఇచ్చామన్నది కాదు ఒక ఫ్లాప్ పడితే చాలు అప్పటివరకు ఉన్న క్రేజ్ అంతా పోతుంది. ఐతే ఫ్యామిలీ స్టార్ లో కూడా మృణాల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో కూడా వరుస క్రేజీ సినిమాల్లో ఛాన్స్ అందుకుంటుంది మృణాల్ ఠాకూర్. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా కోలీవుడ్ నుంచి అమ్మడికి అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది.


తమిళంలో సూర్య సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ అందుకుందట అమ్మడు. అసలైతే సూర్య నటించిన ప్రతిష్టాత్మక సినిమా కంగువలోనే మృణాల్ ని తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఆ టైం లో అమ్మడు వేరే సినిమాల్లో కమిట్ అవ్వడం వల్ల కాదనక తప్పలేదు. ఐతే ఆ సినిమా ఛాన్స్ మిస్సైనా కూడా మరోసారి సూర్య సినిమా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. సూర్య హీరోగా ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో ఒక సినిమా ప్లానింగ్ లో ఉంది. కథా చర్చలు ముగిసిన ఈ సినిమా త్వరలోనే మొదలు కాబోతుంది.


ఈ ప్రాజెక్ట్ లో ఫిమేల్ లీడ్ గా మృణాల్ ని దాదాపు కన్ ఫర్మ్ చేశారట. సో కంగువ మిస్సైనా కూడా మృణాల్ కి సూర్య సినిమా ఆఫర్ వచ్చింది. అదీగాక కంగువ లో హీరోయిన్ పాత్రకు అంత ప్రాముఖ్యత లేదన్న టాక్ వినిపిస్తుంది. సో మృణాల్ ఆ సినిమా చేయకపోవడమే మంచిదైందని అంటున్నారు. ఇప్పటివరకు హిందీ, తెలుగు సినిమాల్లో తన అభినయంతో మెప్పించిన మృణాల్ ఇక మీదట తమిళ ఆడియన్స్ కు తన టాలెంట్ చూపించనుంది. సూర్య సినిమా ఛాన్స్ అంటే అమ్మడికి ఇక వరుస అక్కడ అవకాశాలు వచ్చేస్తాయని చెప్పొచ్చు.

Tags:    

Similar News