మృణాల్ మెహ‌బూబా అవ‌తార్ వైర‌ల్

ఈ ఫోటోషూట్‌లో మృణాల్ నిజానికి మెహ‌బూబాను త‌ల‌పిస్తోందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Update: 2024-11-10 06:47 GMT

`సీతారామం` మొద‌లు ఎన్నో క్లాసిక్ హిట్స్ లో అద్భుత న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న‌తో హృద‌యాల‌ను గెలుచుకుంది మృణాల్ ఠాకూర్. ఈ బ్యూటీ హిందీ చిత్ర‌సీమ‌లోను రాణిస్తోంది. అక్క‌డ అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టిస్తూ .. ఇరుగు పొరుగు భాష‌ల్లో ఏ అవ‌కాశాన్ని విడిచిపెట్ట‌డం లేదు. ముఖ్యంగా టాలీవుడ్ కి డియ‌రెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. ఇటీవ‌లే ప్ర‌భాస్ క‌ల్కి 2989 ఏడిలో మృణాల్ అతిథి పాత్ర ఎంతగానో ఆక‌ట్టుకుంది.

ఇక మృణాల్ కి సోష‌ల్ మీడియాల్లోను భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ భామ ఇన్ స్టాలో త్రోబ్యాక్ ఫోటోషూట్ ఒక‌టి తిరిగి అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతోంది. ఈ ఫోటోషూట్‌లో మృణాల్ నిజానికి మెహ‌బూబాను త‌ల‌పిస్తోందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఎంపిక చేసుకున్న డిజైన‌ర్ దుస్తుల్లో మృణాల్ సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తోందంటూ ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. డిజైన‌ర్ లెహంగా దానిపై దుప‌ట్టాతో మృణాల్ ఒక ర‌కంగా రాణిని త‌ల‌పిస్తోంది. ప్ర‌స్తుతం ఈ అరుదైన ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా దూసుకెళుతోంది.

ఈ లుక్ ని త‌నిష్క్ మ‌ల్హోత్రా డిజైన్ చేయ‌గా, హీనా కోచ‌రో స్టూడియో నుంచి దుస్తుల‌ను ఎంపిక చేసుకున్నారు. తదుప‌రి మృణాల్ సిటాడెల్ - హ‌నీ బ‌న్నీ ద‌ర్శ‌కుడు మ‌నీష్ పాల్ తో వెబ్ సిరీస్ లో న‌టించ‌బోతోంద‌ని ఊహాగానాలు సాగుతున్నాయి. తాజాగా ఓ ఈవెంట్ కోసం వరుణ్ ధావన్, ఈషా గుప్తా, మృణాల్ ఠాకూర్, మనీష్ పాల్ బృందం కలిసి షికార్లు చేయడం ఆస‌క్తిని క‌లిగించింది.

Tags:    

Similar News