పిక్‌టాక్ : బ్లాక్ అండ్ వైట్‌లో మృణాల్ భలే ముచ్చటగా..!
తెలుగు ప్రేక్షకులకు సీతారామం సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతోనే టాలీవుడ్‌లో టాప్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరింది.
తెలుగు ప్రేక్షకులకు సీతారామం సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతోనే టాలీవుడ్‌లో టాప్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరింది. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. మరో వైపు హిందీలోనూ ఈ అమ్మడి సినిమాల జోరు కొనసాగుతోంది. సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన దాదాపు పదేళ్ల తర్వాత తెలుగులో సీతారామం సినిమాతో సక్సెస్‌ను దక్కించుకుంది. గ్లామరస్ పాత్రలతో, స్కిన్ షో పాత్రలతో నార్త్‌లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. బుల్లితెరపైనా ఈ అమ్మడు తన సత్తా చాటేందుకు ప్రయత్నించింది. అయితే సీతారామం సినిమా తీసుకు వచ్చిన స్థాయి ఆమెకు మునుపు ఎప్పుడూ నార్త్ లో దక్కలేదు.
లవ్ సోనియా అనే హిందీ సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన ఈ అమ్మడు సూపర్ 30తో పాటు పలు సినిమాల్లో నటించింది. కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయినా నటిగా అంతగా గుర్తింపు రాలేదు. కెరీర్ ఆరంభం నుంచి ఆఫర్ల కోసం వెతుకులాట కొనసాగించిన మృణాల్ ఠాకూర్ ఇప్పుడు మాత్రం చేతిలో అర డజను సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి నటన ప్రతిభ ఉన్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. అందుకే కెరీర్ ఆరంభంలో లక్ కలిసి రాకున్నా అందంగా ఉండటం వల్ల ఆఫర్లు వచ్చాయి. ఇప్పుడు అదృష్టం కలిసి వచ్చి వరుస సినిమాలు సక్సెస్ కావడంతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది.
హీరోయిన్‌గా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోల షేరింగ్ మాత్రం తగ్గదు. 1.4 కోట్ల ఫాలోవర్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో కలిగి ఉన్న ఈ అమ్మడు వారి కోసం రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు తన అందమైన ఫోటోలను షేర్ చేసింది. అయితే ఈసారి ఈ అమ్మడు బ్లాక్ అండ్ వైట్‌లో విభిన్నమైన స్టైలిష్ లుక్‌లో ఫోటోలను షేర్ చేసింది. స్లీవ్‌లెస్ బనియన్‌ను ధరించి క్యూట్‌గా నవ్వుతూ చూపు తిప్పనివ్వకుండా చేస్తున్న మృణాల్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు లైక్స్, షేర్స్ అత్యధికంగా వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాల విషయానికి వస్తే హిందీలో ఏకంగా నాలుగు సినిమాలు చేస్తుంది. పూజా మేరీ జాన్, హై జవానీ తో ఇష్క్ హోనా హై, సన్నాఫ్ సర్దార్ 2, తుమ్ హో తో సినిమాలను బాలీవుడ్‌లో చేస్తుంది. ఈ సినిమాల్లో కనీసం మూడు ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తాయని సమాచారం అందుతోంది. ఇవి కాకుండా మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలుగులో అడవి శేష్‌తో కలిసి డెకాయిట్ సినిమాలోనూ నటిస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. మొత్తానికి మృణాల్ చాలా బిజీ గురూ.