ర్యాపర్‌తో ప్రేమలో మృణాల్ ఠాకూర్?
అందుకు కారణం లేకపోలేదు. మృణాల్ -ర్యాపర్ బాద్షా శిల్పా శెట్టి దీపావళి పార్టీ నుండి మిడ్ నైట్ లో తిరిగి వెళుతూ ఇద్దరూ చేయి చేయి కలిపి సన్నిహితంగా కనిపించారు.
అతడు పాపులర్ ర్యాపర్. తనదైన గానంతో ఉర్రూతలూగిస్తాడు. బాలీవుడ్ లో చార్ట్ బస్టర్ పాటలు పాడాడు. ప్రపంచవ్యాప్తంగా అతడికి భారీ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు అతడితో 'సీతారామం' బ్యూటీ మృణాళ్ ఠాకూర్ ప్రేమలో ఉందంటూ ప్రచారం సాగుతోంది. ఆ ఇద్దరి మధ్యా సాన్నిహిత్యానికి సంబంధించిన ఓ వీడియో ఇలాంటి సందేహాలకు తావిచ్చింది. ఈ వీడియోని అభిమానులు వైరల్ గా షేర్ చేస్తూ ముచ్చటైన జంట! అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇంతకీ ఆ ర్యాపర్ ఎవరు? అంటే.. అందరికీ సుపరిచితుడే అయిన పాపులర్ గాయకుడు ర్యాపర్ బాద్ షా. మృణాల్ ఠాకూర్, బాద్షా జోడీ డేటింగ్ చేస్తోందంటూ ఒకటే ముంబై మీడియా ప్రచారం సాగించేస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. మృణాల్ -ర్యాపర్ బాద్షా శిల్పా శెట్టి దీపావళి పార్టీ నుండి మిడ్ నైట్ లో తిరిగి వెళుతూ ఇద్దరూ చేయి చేయి కలిపి సన్నిహితంగా కనిపించారు. రెడ్డిట్‌లో ఇప్పుడు పిచ్చిగా వైరల్ అవుతున్న ఈ వీడియో ఎన్నో సందేహాలకు తావిచ్చింది.
ఆసక్తికరంగా మృణాల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ పార్టీ నుండి బాద్షా- శిల్పాశెట్టితో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేసింది. 'ఇద్దరు ఇష్టమైనవారు'' అని వ్యాఖ్యానించింది. ర్యాపర్ బాద్ షా కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మృణాల్ కథనాన్ని రీపోస్ట్ చేశాడు. మృణాల్ ఆలివ్ గ్రీన్ ఎథ్నిక్ దుస్తుల్లో ఎంతో అందంగా కనిపించగా, బాద్షా పూర్తిగా బ్లాక్ కలర్ సంప్రదాయ దుస్తుల్లో స్మార్ట్ గా కనిపించాడు. వారు చేతులు పట్టుకున్న వైరల్ వీడియోపై స్పందిస్తూ, ఒక నెటిజన్ ఇలా వ్యాఖ్యానించాడు. ''జంటగా కలిసి ఉంటారని ఊహించలేదు... వావ్... నిజంగా వావ్..'' అని వ్యాఖ్యానించగా,''చాలా తేడా కేసులాగా కనిపిస్తోంది. వారికి శుభాకాంక్షలు.. ఇద్దరూ చాలా ప్రతిభావంతులు'' అని రాసారు.
నిజానికి ఈ సంవత్సరం ప్రారంభంలో బాద్షా తన చిరకాల ప్రేయసి కం నటి ఇషా రిఖీని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని పుకార్లు వచ్చాయి. ఉత్తర భారతదేశంలో గురుద్వారా సాంప్రదాయ వివాహం జరుగుతందని కూడా కథనాలొచ్చాయి. ఇషా రిఖి పంజాబీ నటి. ఆమె 2013లో జట్ బాయ్స్ పుట్ జట్టన్ దే చిత్రంతో నటనా రంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రంలో సిప్పీ గిల్, ఓం పూరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ నటి 2018లో 'నవాబ్జాదే'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇందులో వరుణ్ ధావన్, రాఘవ్ జుయల్, పునీత్ పాఠక్ కూడా నటించారు. బాద్షా, రిఖీలు ఏడాది కాలంగా డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. వారు తమ పరస్పర స్నేహితులలో ఒకరి ద్వారా పార్టీలో కలుసుకున్నారు. అనంతరం ప్రేమలో పడ్డారు. అయితే ఇప్పుడు రిఖీ స్థానంలో మృణాల్ పేరు వినిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ ఇద్దరూ చేయి చేయి కలిపి నడిచినంత మాత్రాన ప్రేమలో ఉన్నారని చెప్పగలరా? అంతకుమించి ఇంకేదైనా ఉంటే దానికి ప్రూఫ్ లు కావాలి. అప్పటివరకూ ఇవన్నీ గాసిప్స్ మాత్రమే!!