'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'... ఆశలన్నీ ట్రైలర్​పైనే..

ఈ సినిమాపై సినీ ప్రియుల్లో మంచి ఇంట్రెస్ట్ కలిగింది

Update: 2023-07-25 08:38 GMT

అనుష్క-నవీన్‌ పొలిశెట్టి.. ఈ కాంబో అనౌన్స్​ చేయగానే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన సంగతి తెలిసిందే. 'జాతిరత్నాలు' తర్వాత నవీన్‌ పొలిశెట్టి, 'నిశ్శబ్దం' తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి అనుష్క.. ఇద్దరూ ప్రధాన పాత్రధారులుగా ఓ సినిమా చేస్తున్నారు. దానిపేరే 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'. ఆగస్టు 4న చిత్రం రిలీజ్ కానుంది.

మొదట్లో ఈ సినిమాపై సినీ ప్రియుల్లో మంచి ఇంట్రెస్ట్ కలిగింది. ఎందుకో అది క్రమక్రమంగా తగ్గినట్టు అనిపిస్తోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్నప్పటికీ చిత్రంపై అస్సలు బజ్​ క్రియేట్ అవ్వడం లేదు. ఇప్పటికే విడుదలై పోస్టర్​, టీజర్స్​తో ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది మూవీ టీమ్. కానీ అది వర్కౌట్ అయినట్టుగా అనిపించడం లేదు. ఈ టీజర్​లో నవీన్ తన మార్క్​ టైమింగ్​ కామెడీతో నవ్వించాడు. అనుష్క హ్యాండ్సమ్​గా కూల్​ లుక్​లో కనిపించింది. కానీ ఇవి పెద్దగా క్లిక్​ కాలేదని అనిపిస్తోంది.

ఇక ఈ సినిమాను నిర్మించేంది యూవీ క్రియేషన్స్​. ఇప్పటికీ ఈ ప్రొడక్షన్ హౌస్​.. ప్రభాస్ సినిమాల రిలీజ్​ల విషయంలో విమర్శలను ఎదుర్కొంది. 'సాహో' చిత్రం కమర్షియల్​గా వసూళ్లను తెచ్చి పెట్టినా ఆకట్టుకోలేదు. 'రాధేశ్యామ్' ఏమో బాక్సాఫీస్​ వద్ద డిజాస్టర్​గా నిలిచింది. ఈ పరిణామాలన్నింటీ దృష్టిల్లో పెటుకున్న కొందరు.. యూవీ క్రియేషన్స్​ 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి' సినిమా రిలీజ్​ విషయంలోనూ సరిగ్గా జాగ్రత్తలు తీసుకోవ్వట్లేదని అంటున్నారు.

ఇక రేపు(జులై 26).. 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి' ట్రైలర్​ రిలీజ్ కానుంది. దీనిపైనే సినిమా హైప్​ ఆధారపడి ఉంది. ఇది మంచిగా ఆకట్టుకుంటేనే సినిమాపై బజ్​ క్రియేట్ అవుతుంది. లేదంటే ఓపెనింగ్స్​ వసూళ్లపై ఎఫెక్ట్​ పడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత స్టోరీ కంటెంట్​ కూడా ఏమైనా తేడా కొడితే.. అనుష్క ఖాతాలో మరో ఫ్లాప్ వచ్చి పడ్డినట్టవుతుంది. అందుకే యూవీ క్రియేషన్స్ జాగ్రత్తలు తీసుకుని ఈ ట్రైలర్​ను ఆసక్తికరంగా తీర్చిదిద్దాలని సినీ ప్రియులు సూచిస్తున్నారు. చూడాలి మరి రేపు రాబోయే ట్రైలర్​ ఆడియెన్స్​ ఏ మాత్రం ఆకట్టుకుంటుందో, ఎంత వరకు ఇంట్రెస్ట్​ క్రియేట్ చేస్తుందో..

కాగా, ఈ సినిమాకు మహేష్‌బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. వంశీ - ప్రమోద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమాను తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమాలో నవీన్‌ పొలిశెట్టి... సిద్ధు పొలిశెట్టి అనే స్టాండప్‌ కమెడియన్‌ పాత్రలో, అనుష్క... అన్విత రవళిశెట్టి అనే షెఫ్‌ పాత్రలోనూ కనిపించనుంది. రధన్‌ సంగీతం అందిస్తున్నారు. నీరవ్‌ షా.. ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

Tags:    

Similar News