స్టార్ హీరోలో కొరవడిన అంకిత భావం
తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు చంద్రప్రకాష్ ద్వివేదిని 'మీరు అలా ఎందుకు చేసారు?' అని అడిగారు ముఖేష్ ఖన్నా.
ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన పృథ్వీరాజ్ చిత్రం డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. అసలు ఈ సినిమా డిజాస్టర్ అవ్వడానికి అసలు కారణమేమిటో సీనియర్ నటుడు ముఖేష్ ఖన్నా విశ్లేషించారు. పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రను చిత్రీకరించిన సమయంలో అక్షయ్ కుమార్ నిర్లక్ష్యంగా కనిపించాడని ముఖేష్ ఖన్నా విమర్శించారు.
ప్రజలు ఈ సినిమాని ఆదరించకపోవడానికి కారణం 'అతడు జాగ్రత్త తీసుకోలేదు!' అని సూటిగా అన్నారు.
నిజానికి పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రకు వేషధారణ, మేకప్ అత్యంత కీలకమైనవి. ఆ పాత్ర కోసం నిజమైన మీసం పెంచుకోవడంలో శ్రద్ధ చూపించాలి. కానీ అక్షయ్ పట్టించుకోలేదు.. అంకితభావం , అభిరుచి లేకపోవడం కూడా పరాజయానికి కారణమని సాధారణ ప్రజలు విశ్లేషించారు. అక్షయ్ తన శరీరం.. నడక తీరు... పాపులర్ యాక్షన్ సన్నివేశాలపై కూడా పని చేయలేదు. కొన్ని డైలాగ్‌లను యాంత్రికంగా చెప్పడం వల్ల ప్రజలు వోన్ చేసుకోలేదు.
తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు చంద్రప్రకాష్ ద్వివేదిని 'మీరు అలా ఎందుకు చేసారు?' అని అడిగారు ముఖేష్ ఖన్నా. చంద్రప్రకాష్ దూరదర్శన్ కోసం చారిత్రక కథనాలతో అద్బుతమైన షోలను ఇచ్చాడు. అతడు ఎంత హార్డ్ వర్క్ చేసినా లుక్స్ పరంగా కేర్ తీసుకోకపోవడమే పెద్ద మైనస్ అయిందని ముఖేష్ జీ విశ్లేషించారు.