మార్కో హీరోకి షాక్ ఇచ్చిన బేబీ..!

మలయాళంలో తన మార్క్ సినిమాలు చేస్తూ వస్తున్న ఈ నటుడు తెలుగులో కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చాడు.

Update: 2025-03-01 19:01 GMT

ఒక సూపర్ హిట్ పడిన వెంటనే దానికి తగినట్టుగానే మరో సక్సెస్ కొడితే ఆ లెక్క వేరేలా ఉంటుంది. అలా కాకుండా ఒకటి బ్లాక్ బస్టర్ కొట్టి నెక్స్ట్ వచ్చింది డిజాస్టర్ అయితే ఆ హీరో పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందే. ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు మలయాళ హీరో ఉన్ని ముకుందన్. మలయాళంలో తన మార్క్ సినిమాలు చేస్తూ వస్తున్న ఈ నటుడు తెలుగులో కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చాడు.

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ కొడుకుగా చేసిన ఉన్ని ముకుందన్ రుద్రమదేవి, యశోద సినిమాల్లో నటించాడు. ఐతే ఈమధ్యనే అతను చేసిన మార్కో సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. పాన్ ఇండియా లెవెల్ లో మార్కో సినిమా 100 కోట్ల మార్క్ టచ్ చేశాడు. ఐతే మార్కో హిట్ పడింది కదా ఇక కెరీర్ సెట్ రైట్ అయినట్టే అనుకున్న టైం లో నెక్స్ట్ సినిమా వచ్చి ముకుందన్ ఆశలపై నీళ్లు చల్లింది.

ఉన్ని ముకుందన్ నటించిన గెట్ సెట్ బేబీ సినిమా గత వారం రిలీజైంది. ఈ సినిమాను వినయ్ గోవింద్ డైరెక్ట్ చేయగా ఉన్ని ముకుందన్ సరసన నిఖిలా విమల్ నటించింది. చెందన్ వినోద్, శ్యామ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా రిలీజై వారం అవుతున్నా కనీసం 2 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పూర్ రెస్పాన్స్ వచ్చింది.

ముఖ్యంగా మార్కో లాంటి మాస్ హిట్ అందుకున్న ఉన్ని ముకుందన్ చేసిన ఈ సినిమాకు ఇలాంటి రిజల్ట్ రావడం షాక్ ఇస్తుంది. ఐతే సినిమాలో కంటెంట్ ఇంకా రిలీజ్ టైం తో పాటుగా ఆడియన్స్ సినిమాను రిసీవ్ చేసుకునే విధంగా ఏదో ఒక మ్యాజిక్ జరగాలని అంటున్నారు. అందుకే మార్కోతో ముకుందన్ ఊహించని రిజల్ట్ అందుకోగా గెట్ సెట్ బేబీ మాత్రం డిజప్పాయింట్ చేసింది. ఐతే ఈ సినిమా రిజల్ట్ ఉన్ని ముకుంద కెరీర్ మీద ఎంత ఎఫెక్ట్ పడేలా చేస్తుంది అన్నది మాత్రం చెప్పడం కష్టం. మార్కో తో వైలెన్స్ తో పిచ్చెక్కించిన ఉన్ని ముకుందన్ ఆడియన్స్ అతని నుంచి అలాంటి సినిమాలే ఆశిస్తున్నారన్న విషయం మాత్రం క్లియర్ కట్ గా అర్ధమవుతుంది. ఐతే నెట్ సెట్ బేబీ రిజల్ట్ మాత్రం మార్కో హీరోకి నిజంగా షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు.

Tags:    

Similar News