మిడిల్ క్లాస్ మల్టీప్లెక్స్.. టికెట్ కాస్ట్ చాలా చీప్!
ఇప్పుడు వారి కోసమే బడ్జెట్ ఫ్రెండ్లీ మల్టీప్లెక్స్ లు వస్తున్నాయి! నవంబర్ చివరి కల్లా ఆరు నగరాల్లో మొదలు కానున్నాయి.
మల్టీప్లెక్స్ లో సినిమాలు చూడాలని అంతా అనుకుంటారు. కానీ సామాన్య ప్రజలు.. మల్టీప్లెక్స్ లకు వెళ్లి మూవీస్ చూసేందుకు భయపడుతుంటారు. అందుకు కారణం ధరలే. నార్మల్ థియేటర్ లో టికెట్ ధర రూ.200 లోపు ఉంటే.. మల్టీప్లెక్స్ లో మాత్రం ఎక్కువే. దీంతో ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఆడియన్స్ కాస్తంత దూరంగా ఉంటున్నారని చెప్పాలి. కానీ మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలని కోరిక మాత్రం వారిలో ఉంటుంది!
ఇప్పుడు వారి కోసమే బడ్జెట్ ఫ్రెండ్లీ మల్టీప్లెక్స్ లు వస్తున్నాయి! నవంబర్ చివరి కల్లా ఆరు నగరాల్లో మొదలు కానున్నాయి. 2026 కల్లా 150 మిడిల్ క్లాస్ మల్లీప్లెక్స్ లు అందుబాటులోకి రానున్నాయి. వివిధ మల్టీప్లెక్స్ లతో పోలిస్తే.. అవి 30-40% తగ్గింపు ధరకు టిక్కెట్లను అందించనున్నాయి. రూ.150-రూ.175 మధ్యే సినిమాను చూసే అవకాశం కల్పించనున్నాయి. మరి ఎవరివి? ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి?
ప్రముఖ నిర్మాత టూ టూ శర్మకు చెందిన సితార ఎంటర్టైన్మెంట్ (Citara Entertainment) సంస్థ.. తక్కువ ధరకే సరసమైన మల్టీప్లెక్స్ ఎక్స్పీరియన్స్ ను అందించాలని నిర్ణయం తీసుకుంది. అందుకు గాను టైర్-2, టైర్-3 నగరాల్లో సరికొత్త మల్టీప్లెక్స్ లు మొదలుపెట్టనుంది. వినోదాన్ని అందరికీ తక్కువ ధరలకే అందేలా ప్లాన్ చేస్తోంది. రూ.150-రూ.175 మధ్యలో మల్టీప్లెక్స్ టికెట్ ధరను నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రీసెంట్ గా.. టైర్-2, టైర్-3 నగరాల్లో ఎంటర్టైన్మెంట్ రంగానికి డిమాండ్ పెరిగిందని ఓ నివేదిక వెల్లడించింది. దీంతో దాన్ని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ వినియోగించుకోవాలని చూస్తోంది. అదే సమయంలో మధ్య తరగతి కుటుంబాలకు చెందిన సినీ ప్రియులపై దృష్టి పెట్టింది. మిడిల్ క్లాస్ మల్టీ ప్లెక్స్ లను ఏర్పాటు చేస్తోంది. ప్రతి స్క్రీన్ లో 90-110 మెంబర్స్ కూర్చుని సినిమా చూసే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు తెలుస్తోంది.
మల్టీ ప్లెక్స్ లో పిల్లలు ఆడుకునేందుకు గేమ్ స్పేస్ తో పాటు ఇతర సౌకర్యాలు కూడా కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో మిడిల్ క్లాస్ మల్టీప్లెక్స్ లపై నెటిజన్లు స్పందిస్తున్నారు. మంచి నిర్ణయమని చెబుతున్నారు. అదే సమయంలో ఇప్పటికే మార్కెట్లో మంచి క్రేజ్ ఉన్న PVR వంటి సంస్థలతో Citara మల్టీప్లెక్స్ లకు పోటీ ఉండనుంది! మరి Citara మల్టీప్లెక్స్ లు ఎలా ఉంటాయో? ఎక్కడ ఏర్పాటు అవుతాయో వేచి చూడాలి.