మల్టీప్లెక్స్‌@99.. మనకి లేనట్లే

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ విధానాలు ఇతర కారణాల వల్ల ఇక్కడ 99 రూపాయల టికెట్‌ ను ఇవ్వలేకపోతున్నామని మల్టీ ప్లెక్స్ ల నిర్వాహకులు అంటున్నారు.

Update: 2024-02-22 16:30 GMT

గత ఏడాది దేశ వ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్‌ ల్లో ఏ సినిమా అయినా, ఏ షో అయినా కేవలం 99 రూపాయలకే చూసే అవకాశం కల్పించారు. ఏడాదిలో ఒక రోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సాధారణ ప్రేక్షకులను కూడా మల్టీ ప్లెక్స్‌ లోకి తీసుకు రావాలని భావించడం మంచి నిర్ణయం అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ ఏడాది కూడా అలాంటి 99 రూపాయల ఆఫర్‌ ను పీవీఆర్ మరియు ఐనాక్స్ లు ప్లాన్‌ చేస్తున్నాయి. ఉత్తర భారతంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా రూ.99 లకు మల్టీప్లెక్స్ సినిమా ఛాన్స్ ఇచ్చారు. రేపు పెద్ద ఎత్తున సినిమాలను చూసేందుకు మల్టీప్లెక్స్ లో సాధారణ ప్రేక్షకులు బారులు తీరబోతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది. తెలంగాణ మరియు ఏపీల్లో ఉన్న ప్రభుత్వ విధానాలు మరియు జీఓ ల కారణంగా 99 రూపాయలకు మల్టీప్లెక్స్ ఎంట్రీ ఇవ్వడం లేదు. సాధారణ ప్రేక్షకులు ఈ విషయమై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఏడాదిలో ఒక్క రోజు అయినా మాలాంటి వారికి మల్టీప్లెక్స్ లో కాలు పెట్టే అవకాశం వచ్చింది అనుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది అంటూ సాధారణ ప్రేక్షకులు మరియు మధ్య తరగతి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ విధానాలు ఇతర కారణాల వల్ల ఇక్కడ 99 రూపాయల టికెట్‌ ను ఇవ్వలేకపోతున్నామని మల్టీ ప్లెక్స్ ల నిర్వాహకులు అంటున్నారు. అయితే ఈ విషయమై వారు ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ తీసుకుంటే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనీసం వచ్చే ఏడాదిలో అయినా 99 రూపాయలకు మల్టీప్లెక్స్ లో మూవీ చూసే అవకాశం తెలుగు వారికి దక్కుతుందేమో చూడాలి.

Tags:    

Similar News