దేవుడు వరమిస్తే చావుని కోరుకుంటా!
ఇండస్ట్రీలో ఎవరెప్పుడు ఎలా స్టార్ లు అవుతారో, ఎలా స్టార్‌డమ్ వస్తుందో ఎవరూ ఊహించలేరు.;

ఇండస్ట్రీలో ఎవరెప్పుడు ఎలా స్టార్ లు అవుతారో, ఎలా స్టార్‌డమ్ వస్తుందో ఎవరూ ఊహించలేరు. కొన్ని సార్లు అప్పటివరకు సక్సెస్‌లో ఉన్న వాళ్లు ఒక్కసారిగా డౌన్ ఫాల్ అవుతుంటారు, మరికొన్ని సార్లు అసలు ఫామ్ లో లేని వాళ్లు ఉన్నట్టుండి లైమ్ లైట్ లోకి వచ్చేస్తారు. ఎవరికి ఎప్పుడు ఎలా టైమ్ వస్తుందో ఎవరూ చెప్పలేం.
ఇప్పుడు అలా సక్సెస్ అయి ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చిన నటుడే మురళీధర్. ఆయన వయసు 45-50 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఎప్పట్నుంచో ఇండస్ట్రీలో ఉన్న మురళీధర్ బలగం సినిమా తర్వాత బాగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత డీజే టిల్లు, మ్యాడ్, టిల్లు స్వ్కేర్, మ్యాడ్ స్వ్కేర్ సినిమాలతో ఆడియన్స్ ను మెప్పించి ఆయనలో ఓ మంచి కమెడియన్ ఉన్నాడని అందరూ చెప్పుకునే స్థాయికి ఎదిగారు.
రీసెంట్ గా మ్యాడ్ స్వ్కేర్ సినిమాతో బాగా పాపులరైన మురళీధర్ గౌడ్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్య్వూలో పాల్గొని అందులో తన అభిప్రాయాల్ని, ఆలోచనల్ని షేర్ చేసుకున్నారు. ఇంటర్య్వూలో భాగంగా యాంకర్ ఆయన్ను ఓ ప్రశ్న అడిగింది. దేవుడు వరమిచ్చి ఏదైనా కోరిక కోరుకోమని చెప్తే ఏం కోరుకుంటారని ఆమె అడిగ్గా, దానికి ఆయన చావుని కోరుకుంటానని చెప్పి షాకయ్యేలా చేశారు.
అలా ఎందుకంటున్నారని యాంకర్ అడగ్గా, నేను చావుకు రెడీగా ఉన్నానని, ఎప్పుడంటే అప్పుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని, దేవుడు అనుకుని నేను సాధించాల్సింది ఏదైనా ఉంటే సాధిస్తా, నా లైఫ్ ఇప్పటివరకు చాలనిపిస్తుందని, అలా అని ఇప్పుడు లైఫ్ లో ఫుల్ హ్యాపీగా ఉన్నానని చెప్పడం లేదన్నారు మురళీధర్.
కష్టాలు అందరికీ ఉంటాయని, కానీ ఈ రోజుల్లో అందరికీ డబ్బు మీద వ్యామోహం పెరిగిందని, డబ్బు అవసరమే అయినా అవసరానికి మించిన డబ్బు.. బంధాలు, బంధుత్వాల్ని దూరం చేస్తుందని, తన వరకు మాత్రం డబ్బు కంటే ప్రేమ, బంధాలే ముఖ్యమని ఆయన తెలిపారు. మురళీధర్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.