దేవుణ్ణి న‌మ్మ‌ని న‌టుడీయ‌న‌!

అయితే తెలుగు సినిమాల‌కంటే ముందే బాలీవుడ్ లో పేమ‌స్ అయిన న‌టుడు. అక్క‌డ నుంచి టాలీవుడ్ కి దిగుమ‌తి అయ్యాడు.

Update: 2025-01-04 12:30 GMT

న‌టుడు ముర‌ళీ శ‌ర్మ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. `అతిధి`లో విల‌న్ గా ఎంట్రీ ఇచ్చిన ముర‌ళి శ‌ర్మ అటుపై ఎన్నో చిత్రాల్లో వివిధ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించారు. న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించు కున్నాడు. ప్ర‌తి నాయ‌కుడిగా, హాస్య న‌టుడిగా , విభిన్న పాత్ర‌ల‌తో మెప్పించాడు. అయితే తెలుగు సినిమాల‌కంటే ముందే బాలీవుడ్ లో పేమ‌స్ అయిన న‌టుడు. అక్క‌డ నుంచి టాలీవుడ్ కి దిగుమ‌తి అయ్యాడు.

బాలీవుడ్ సినిమాల్లో న‌టించ‌డంతో అంతా ముర‌ళీ శ‌ర్మ‌ని హిందీ న‌టుడు అనుకుంటారు. కానీ ఆయ‌న తెనాలికి చెందిన తెలుగు న‌టుడని కాల‌క్ర‌మంలో తెలిసింది. తాజాగా ముర‌ళీ శ‌ర్మ దేవుడిపై త‌న అభిప్రాయాన్ని పంచు కున్నాడు. ఆయ‌న దేవుడిని న‌మ్మ‌డంట‌. గుడికి వెళ్లి దండాలు పెట్ట‌డం..మొక్కులు తీర్చ‌డం వంటివి ఏనాడు చేయ‌లేదన్నాడు. ప్ర‌జ‌ల్లో దేవుడిని చూసే మ‌నిషిన‌న్నారు. త‌న‌ని వ్య‌క్తిగ‌తంగా అభిమానించే వారు కూడా అలాంటి వారే ఎక్కువ‌గా ఉన్నార న్నారు.

`ప్ర‌తీది మన చుట్టూనే ఉందని న‌మ్ముతాను. జీవితం చాలా అంద‌మైన‌ది. నా చుట్టూ అంతా పాజిటివ్ ఎనర్జీతో ఉన్న వాళ్లే ఉంటారు. నేను హైద‌రాబాద్ లో ఉంటే నా ముంబై స్టాప్ అంతా ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. రోజుకు ఒక్క సారైనా వాళ్లు నాతో త‌ప్ప‌క మాట్లాడుతారు. వాళ్లంతా న‌న్ను బాగా అర్దం చేసుకున్న మ‌నుషులు. నా కుటుంబం కూడా అంతే అందంగా ఉంటుంది. భార్య‌, పిల్ల‌లు ఎంతో మంచి కుటుంబం ఎవ‌రూ కూడా నెగిటివ్ గా ఉండ‌రు.

పాజిటివ్ మైండ్ తోనే డే మొద‌ల‌వుతుంది. దేనికోసమే ఆరాట ప‌డేవాడిని కాదు. చాలా సింపుల్ గా ఉన్నంత‌లో సంతోషంగా జీవించే వాడిన‌న్నారు. మొత్తానికి ముర‌ళీ శ‌ర్మ కూడా రాంగోల్ వ‌ర్మ పార్టీ అనే తెలుస్తుంది. వ‌ర్మ కూడా దేవుడిని న‌మ్మ‌ని మ‌నిషి. ఆయ‌న శిష్యుడు పూరి జ‌గ‌న్నాధ్ కూడా అలాంటి వ్య‌క్తిత్వం గ‌ల‌వారే. ఇంకా గాడ్ ని న‌మ్మ‌ని వారు ఇండ‌స్ట్రీలో చాలా మంది ఉన్నారు.

Tags:    

Similar News