వింటేజ్ మహేష్.. మళ్ళీ ఏదో చేసేలా ఉన్నాడు

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ బాబు బెస్ట్ సినిమాలలో ఒకటిగా చెప్పొచ్చు.

Update: 2024-08-09 06:13 GMT

టాలీవుడ్ లో ప్రస్తుతం నడుస్తోన్న రీరిలీజ్ ట్రెండ్ లో ఎప్పటికప్పుడు స్టార్ హీరోల పాత సినిమాలు 4K వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకి వస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయన క్లాసిక్ హిట్ మూవీ మురారి రీరిలీజ్ అయ్యింది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ బాబు బెస్ట్ సినిమాలలో ఒకటిగా చెప్పొచ్చు. రాజకుమారుడు తర్వాత మహేష్ బాబుకి సక్సెస్ ఇచ్చిన మూవీ ఇది.

23 ఏళ్ళ తర్వాత ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేశారు. చాలా రోజుల నుంచి మురారి రీరిలీజ్ గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో సినిమా చూడాలనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. చాలా తెలుగు సినిమాలకి రీరిలీజ్ లో కూడా మంచి ఆదరణ లభించింది. ఖుషి, ఆరెంజ్, సింహాద్రి, పోకిరి, ఒక్కడు లాంటి మూవీస్ అయితే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్నాయి.

సింహాద్రి సినిమాకి అయితే రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఈ సినిమా రీరిలీజ్ సందర్భంగా తారక్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ గా ప్రమోట్ చేశారు. దీంతో ఆస్ట్రేలియాలో సింహాద్రి రీరిలీజ్ సందర్భంగా 12.1K టికెట్స్ అడ్వాన్స్ గా బుక్ అయ్యాయి. అయితే ఇప్పుడు మురారి సినిమా 15 వేల టికెట్స్ తో సింహాద్రి రికార్డ్ ని బ్రేక్ చేసింది. ఆస్ట్రేలియానిలోనే మురారి సినిమాకి ఈ స్థాయిలో టికెట్ బుకింగ్స్ జరగడం అంటే విశేషమని చెప్పాలి.

ఓవరాల్ గా చూసుకున్న కూడా 1.40 లక్షల టికెట్స్ సేల్ అయ్యాయంట. దీనిని బట్టి మురారికి ఏ స్థాయిలో ఫ్యాన్స్ నుంచి ఆదరణ లభించిందో అర్ధం చేసుకోవచ్చు. మురారి మూవీ మహేష్ బాబు కెరియర్ తొలినాళ్ళలో చేసిన సినిమా కావడంతో దీని 4K వెర్షన్ ని థియేటర్స్ లో చూడాలనే ఆసక్తి ఫ్యాన్స్ లో ఎక్కువగా నెలకొని ఉంది. అందుకే ఈ స్థాయిలో స్పందన లభించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ రీరిలీజ్ లాంగ్ రన్ కలెక్షన్స్ తో ఖుషి పేరు మీద ఉన్న రికార్డ్ ని ఏమైనా బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి.

ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో మూవీకి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకి సంబందించిన అప్డేట్ కూడా ఆయన బర్త్ డే సందర్భంగా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది తెలియదు. ఇక మహేష్ బర్త్ డే సందర్భంగా సెలబ్రెటీ ప్రముఖులు ఆయనకి సోషల్ మీడియాలో విషెస్ తెలియజేస్తున్నారు.

Tags:    

Similar News