రాజా వారి హెచ్చరిక..!
ఈ విషయంలో తన మీద వస్తున్న విమర్శలు కూడా పరిగణలోకి తీసుకున్న ఇళయరాజా లేటెస్ట్ గా తను మ్యూజిక్ డైరెక్ట్ చేసిన విడుదల 2 ఆడియో ఈవెంట్ లో తన రికార్డులు నువ్వు వాడినా నోటీసులు పంపిస్తానని అంటూ దర్శకుడు వెట్రిమారన్ ను ఉద్దేశించి అన్నారు.
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఈమధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన మ్యూజిక్ రికార్డింగ్స్ ఎక్కడ వినిపించినా లీగల్ యాక్షన్ కు దిగుతున్నారు. ప్రాణ స్నేహితుడు ఎస్పీబీ తోనే ఆయన అంతకుముందు ఈ విషయంపై వాదనకు దిగిన విషయం తెలిసిందే. ఐతే అదంతా ఒకప్పుడు జరిగిందని మర్చిపోడానికి లేదు. ఇళయరాజా సాంగ్ చిన్న బిట్ వాడినా సరే ఆయన నుంచి సీరియస్ రియాక్షన్ వస్తుంది.
రీసెంట్ గా మళయాళ మూవీ మంజుమ్మల్ బోయ్స్ లో గుణ సాంగ్ తన పర్మిషన్ లేకుండా వాడారంటూ ఇళయరాజా వారి మీద లీగల్ యాక్షన్ కు దిగారు. ఐతే ఆ ఇష్యూ ఎలాగోలా సాల్వ్ చేసుకున్నారు. ఇళయరాజా ఈమధ్య ఎక్కువగా ఇలాంటి గొడవల వల్లే వార్తల్లో నిలుస్తున్నారు. ఐతే ఇళయరాజా ఎంత గొప్ప సంగీత దర్శకుడో అందరికీ తెలిసినా ఈ గొడవల్లో ఆయన్ను సమర్ధిస్తున్న వారితో పాటు విమర్శించే వారు ఉన్నారు.
ఈ విషయంలో తన మీద వస్తున్న విమర్శలు కూడా పరిగణలోకి తీసుకున్న ఇళయరాజా లేటెస్ట్ గా తను మ్యూజిక్ డైరెక్ట్ చేసిన విడుదల 2 ఆడియో ఈవెంట్ లో తన రికార్డులు నువ్వు వాడినా నోటీసులు పంపిస్తానని అంటూ దర్శకుడు వెట్రిమారన్ ను ఉద్దేశించి అన్నారు. ఆయన అన్నది సరదాగానే అయినా ఆయన రికార్డులు వాడి పైపెచ్చు ఆయన మీదే విమర్శలు చేస్తున్న వారికి.. అలాంటి వారికి సపోర్ట్ గా మాట్లాడుతున్న వారికి ఇళయరాజా హెచ్చరించినట్టు చెప్పుకోవచ్చు.
ఇళయరాజా సంగీతాన్ని వింటూ ఆయన సంగీత ప్రపంచంలో పెరిగిన ఈ తరం ప్రేక్షకులకు ఆయన ఇలా లీగల్ నోటీసులు, కోర్టులు గొడవలు అంటూ మాట్లాడటం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఐతే ఆయన పర్మిషన్ తీసుకునో.. లేదా ఆయన ట్యూన్ వాడుతున్నందుకు తగిన రెమ్యునరేషన్ ఇచ్చో అవి వాడితే ఆయనకు కూడా రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది. మరి ఈ విషయంలో మేకర్స్ ఇక మీదట అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటే బెటర్ అని చెప్పొచ్చు.
ఇళయరాజా సాంగ్స్ అంటే కంపోజింగ్ ఆయనవే అయినా అవి తమ సొంతం అనుకునే ప్రేక్షకులు ఉన్నారు. ఇప్పటివరకు ఏదైనా ఆయన పర్మిషన్ లేకుండా సినిమాలో ఆయన పాట వాడినా అది ఇళయరాజా మీద ఉన్న ప్రేమతో తప్ప కావాలని ఆయన్ను కించపరచడం కోసం కాదు. మరి ఈ విషయంలో ఈసారి ఎలాంటి తప్పు జరగకుండా ముందే ఆయన్ను సంప్రదించి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే ట్యూన్స్ వాడితే అందరికీ మంచిది.