ఒళ్లు దగ్గర పెట్టుకుని చేస్తే.. ట్రైలర్ తోనే అది తెలుస్తుంది..!

అజయ్ ఘోష్, చాందిని చౌదరి లీడ్ రోల్ లో శివ పాలడుగు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి

Update: 2024-06-13 03:52 GMT

అజయ్ ఘోష్, చాందిని చౌదరి లీడ్ రోల్ లో శివ పాలడుగు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. జూన్ 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ వచ్చారు. సినిమా ఈవెంట్ కు వచ్చి తన స్పీచ్ తో మెప్పించారు సాయి రాజేష్.

సాయి రాజేష్ మాట్లాడుతూ.. బేబీ సినిమాకు ఓవర్సీస్ లో హర్ష డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ సినిమాను ఆయన నిర్మించడం వల్ల ఈ ఈవెంట్ కి వచ్చానని అన్నారు. ధీరజ్ ఈ సినిమా రిలీజ్ చేయడం మంచి విషయం. తన సొంత సినిమాకు కూడా ఇంత బాగా మాట్లాడలేదని అన్నారు. మ్యూజిక్ షాప్ మూర్తి గురించి చెబుతూ సినిమా ట్రైలర్ చూసినప్పుడే ఒళ్లు దగ్గర పెట్టుకుని చేశాడని అనిపించింది. సినిమాను ఇష్టపడి చేస్తే ఇలానే ఉంటుందని అన్నారు.

పవన్ గారి మ్యూజిక్ బాగుంటుంది.. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను.. ఈ సినిమాకు ఆయన అందించిన సంగీతం బాగుంది. అందరు యాక్టర్స్ తమ బెస్ట్ ఇచ్చారు. చాందిని చౌదరి మా కలర్ ఫోటో చేసింది. ఆమె ఒక వండర్ ఫుల్ పర్ఫార్మర్. ఈ సినిమాతో ఆమెకు మంచి బ్రేక్ రావాలని అన్నారు.

అజయ్ ఘోష్ ఎలాంటి పాత్రలో అయినా మెప్పించగలరు. మంచి రోజులొచ్చాయి లాంటి సినిమాతో పాటు పుష్ప లాంటి సినిమా చేస్తారు. ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకు రావాలని కోరుతున్నా అని తన స్పీచ్ ముగించారు సాయి రాజేష్.

మ్యూజిక్ షాప్ మూర్తి ఒక మంచి ప్రయత్నమని.. సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందని అన్నారు దర్శక నిర్మాతలు. సినిమా కోసం యూనిట్ అంతా చాలా కష్టపడ్డారు. కంటెంట్ ఉన్న సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అలానే మ్యూజిక్ షాప్ మూర్తిని కూడా ఓన్ చేసుకుంటారని చిత్ర యూనిట్ అన్నారు. అజయ్ ఘోష్, చాందిని చౌదరి ఇద్దరు తమ పాత్రలతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తారని. సినిమా చూశాక ఒక గొప్ప అనుభూతి కలుగుతుందని అన్నారు.

జూన్ 14న రిలీజ్ అవుతున్న మ్యూజిక్ షాప్ మూర్తి ఈవెంట్ తో ఆడియన్స్ లో కూడా పాజిటివ్ బజ్ వచ్చింది. సినిమా ట్రైలర్ కూడా ఆసక్తికరంగానే ఉంది. మరి సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News