డబుల్ రిలీజ్ తో మైత్రీ మళ్లీ సక్సెస్.. రికార్డు కూడా బ్లాస్ట్!

మరోవైపు, బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ లీడ్ రోల్ లో తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన జాట్ మూవీ కూడా మంచి వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.;

Update: 2025-04-14 16:48 GMT
డబుల్ రిలీజ్ తో మైత్రీ మళ్లీ సక్సెస్.. రికార్డు కూడా బ్లాస్ట్!

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్.. ఓ రేంజ్ లో అదరగొడుతూ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. శ్రీమంతుడు మూవీతో ఎంట్రీ ఇచ్చిన మైత్రీ సంస్థ.. ఆ తర్వాత అనేక సినిమాలు నిర్మించింది. బాక్సాఫీస్ వద్ద ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఇప్పుడు అనేక చిత్రాలను భారీ బడ్జెట్ తో రూపొందిస్తోంది.

అయితే ఒకే బ్యానర్ నుంచి రెండు సినిమాలు.. కొద్ది రోజుల్లో రిలీజ్ చేయడం చాలా రేర్. కానీ మైత్రీ సంస్థ మాత్రం రోజుల గ్యాప్ కాదు.. ఒకే రోజు రెండు సినిమాలను రిలీజ్ చేసింది. కోలీవుడ్ స్టార్ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో పాటు బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ జాట్ ను ఏప్రిల్ 10వ తేదీన గ్రాండ్ గా విడుదల చేసింది.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీర సింహారెడ్డి చిత్రాలను మైత్రీ తక్కువ రోజుల్లో గ్యాప్ లోనే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. రెండు చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు జాట్, గుడ్ బ్యాడ్ అగ్లీ విషయంలో డబుల్ ధమాకా ఫార్మూలా ఫాలో అయిన మైత్రీ సంస్థ.. మరోసారి సక్సెస్ అయింది.

అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ.. ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద రూ.152 కోట్ల వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అజిత్ కెరీర్ లో అత్యంత వేగవంతమైన వసూళ్లు రాబట్టిన మూవీల్లో ఒకటిగా నిలిచిందని అంటున్నారు. మరిన్ని కలెక్షన్స్ రాబట్టనుందని అంచనా వేస్తున్నారు.

మరోవైపు, బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ లీడ్ రోల్ లో తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన జాట్ మూవీ కూడా మంచి వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా రూ.50 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు, అజిత్ మూవీ అంత కాకపోయినా బాగానే రాబడుతోందని అంటున్నాయి.

మొత్తానికి రెండు హై ప్రొఫైల్ మూవీస్ కూడా వసూళ్ల పరంగా రానిస్తున్నాయనే చెప్పాలి. ఏదేమైనా ఒకేరోజు రెండు సినిమాలు రిలీజ్ చేయడం.. అటు బిజినెస్ పరంగా.. ఇటు లాజిస్టిక్ పరంగా అంత ఈజీ కాదు. కానీ మైత్రీ సంస్థ ఆ విషయంలో అద్భుతం చేసింది. కొత్త రికార్డులు సృష్టించడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద నయా బెంచ్ మార్క్ ను కూడా క్రియేట్ చేసింది.

Tags:    

Similar News