మ్యాడ్ నెస్ ఆఫ్ 2 మ్యాడ్ పీపుల్.. శిఖరాగ్రాన నిలిచింది..!

నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ.. ఒకే ఆట సినిమా 9:30 షో చూసి వచ్చాక అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరికీ ఒకటే మాట చెప్పా ఇద్దరు మ్యాడ్ నెస్ ఆఫ్ 2 మ్యాడ్ పీపుల్ అది ఈ సినిమా అన్నారు.

Update: 2024-12-07 14:55 GMT

గురువారం రిలీజైన పుష్ప 2 సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా సినిమా సక్సెస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా పుష్ప 2 నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవి శంకర్ ల స్పీచ్ ప్రేక్షకులను అలరించింది. ముందుగా మైత్రి నిర్మాత నవీన్ మాట్లాడుతూ సినిమా రిలీజ్ దాకా చాలా పని ఉంది. రిలీజ్ తర్వాత ఇంకా పని పెరిగింది. రోజుకి రెండు మూడు గంటలు మాత్రమే పడుకుంటున్నామని అన్నారు. వస్తున్న కాల్స్, మెసేజ్ లకు రిప్లై ఇచ్చి ఫోన్ బిజీ అయ్యిందని అన్నారు. ఈ సినిమా విజయం సాధించింది అన్న దానికి ఇదే నిదర్శనం అన్నారు.

పుష్ప 2 ఫాస్టెస్ట్ 500 కోట్ల మూవీ అయినందుకు సంతోషంగా ఉంది. ఇది ఇంకా చాలా లాంగ్ వెళ్తుంది. మేము ఊహించిన దాని కన్నా అంచనాలు అందేలా ప్రెడిక్షన్స్ కనబడుతున్నాయని అన్నారు నవీన్. సినిమాను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు, వరల్డ్ సినీ లవర్స్ కు థాంక్స్ అని అన్నారు నవీన్. తెలుగు సినిమా ఎక్కడికి వెళ్లింది అంటే ఇదివరకు ఆంధ్రా, సీడెడ్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకునే స్టేజ్ నుంచి తమిళనాడు, పంజాబ్, కర్ణాటక, గుజరాత్ ఇలా మాట్లాడుతున్నాం.. ప్రతి రోజు ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందని అన్నారు నవీన్. ఈ సినిమాకు మీడియా ఇచ్చిన సపోర్ట్ ఇంకా ఆడియన్స్ ఇచ్చిన సపోర్ట్ కు థాంక్స్ అని అన్నారు.

ఇక ఇదే ప్రెస్ మీట్ లో మైత్రి మూవీస్ మరో నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ.. ఒకే ఆట సినిమా 9:30 షో చూసి వచ్చాక అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరికీ ఒకటే మాట చెప్పా ఇద్దరు మ్యాడ్ నెస్ ఆఫ్ 2 మ్యాడ్ పీపుల్ అది ఈ సినిమా అన్నారు. అది వరల్డ్ వైడ్ అందరు విట్ నెస్ చేస్తున్నారని చెప్పారు. ఆ స్టేట్ మెంట్ కు కట్టుబడి ఉన్నామని.. ఎవరు చూసినా సరే దీన్ని ఏకీభవిస్తారని అన్నారు. మన తెలుగు సినిమా హిందీలో మిగతా భాషల్లో శిఖరాగ్రాన నిలుస్తుంది. ఈ సక్సెస్ కు సపోర్ట్ చేసిన మీడియాకు, ఆడియన్స్ కు థాంక్స్ అని అన్నారు రవి శంకర్.

Tags:    

Similar News