ప్రాక్సీ స్టైల్ లో ప్రదీప్ - మైత్రి రవి.. అదరగొట్టేసారు!

ముఖ్యంగా యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, యాక్షన్ మిక్స్ చేసిన కథాంశం ఈ సినిమాకు బిగ్ అసెట్‌గా మారింది.;

Update: 2025-03-03 12:59 GMT

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘డ్రాగన్’ సినిమా మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా రిలీజైన మొదటి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని, కలెక్షన్ల పరంగా దూసుకుపోతూ అన్ని భాషల్లోనూ మెప్పించింది. ముఖ్యంగా యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, యాక్షన్ మిక్స్ చేసిన కథాంశం ఈ సినిమాకు బిగ్ అసెట్‌గా మారింది.

ఈ సినిమా ఇప్పటివరకు 100 కోట్ల గ్రాస్‌ను దాటేసి, తమిళంలోను బిగ్ హిట్‌గా నిలిచింది. తెలుగులోనూ స్టడీ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద నిలబడింది. నార్త్ ఇండియాలోనూ డీసెంట్‌గా ఆడింది. ఈ రేంజ్‌లో చిన్న సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. లిమిటెడ్ బడ్జెట్‌తో చేసిన ఈ సినిమా, కంటెంట్ బలంతో ప్రేక్షకులను మెప్పించిందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ బిటెక్ స్టూడెంట్‌గా చేసిన పాత్ర యూత్‌ను బాగా ఎట్రాక్ట్ చేసింది. ఓ సాధారణ విద్యార్థి అల్లరిగా ఉంటూనే తన జీవితం కోసం ఎలాంటి ప్రయాణం చేస్తాడు అనేదే ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు అద్భుతంగా మలిచారు. సినిమా కథలో కామెడీ, డ్రామాను మిక్స్ చేయడంతో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్, స్టూడెంట్ లైఫ్‌తో ముడిపడిన డైలాగ్స్ యూత్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఇక తెలుగులో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సినిమా విజయం సాధించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్ మీట్‌లో చిత్ర యూనిట్ సందడి చేసింది. సినిమాలోని ప్రాక్సీ ఇంటర్వ్యూ తరహాలో సీన్‌ను స్టేజ్ మీద ఇమిటేట్ చేసిన ప్రొడ్యూసర్ రవి - హీరో ప్రదీప్ అందరిని తెగ నవ్వించారు. మీడియా మిత్రులకు ప్రేక్షకులకు థాంక్స్ చెబుతన్నట్లుగా నిర్మాత రవి మాట్లాడగా దాన్ని ప్రదీప్ తను మాట్లాడుతున్నట్లు అనుకరించారు.

ఇక అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రదీప్ రంగనాథన్‌తో మరో సినిమా చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్‌పై కూడా అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ‘డ్రాగన్’ విజయంతో ప్రదీప్ మార్కెట్ పెరిగింది. దీంతో ఆయన నెక్ట్స్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ప్రదీప్-మైత్రి కాంబో సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News