తెలంగాణ‌లో మైత్రీ జగ‌దాంబా థియేట‌ర్!

అన‌తి కాలంలో బ‌డా నిర్మాణ సంస్థ‌గా ఖ్యాతికెక్కిన మైత్రీమూవీ మేక‌ర్స్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌సరం లేదు.

Update: 2024-04-05 05:39 GMT

అన‌తి కాలంలో బ‌డా నిర్మాణ సంస్థ‌గా ఖ్యాతికెక్కిన మైత్రీమూవీ మేక‌ర్స్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌సరం లేదు. ఆరంభం నుంచే స్టార్ హీరోలే టార్గెట్ గా సినిమాలు నిర్మిస్తూ బ్యాక్ టూ బ్యాక్ విజ‌యాలు అందుకున్నారు. అటుపై టైర్ -2 హీరోల‌తోనూ సినిమాలు నిర్మించి అక్క‌డా స‌క్సెస్ అయ్యారు. చిత్ర రంగంలో ఓ నిర్మాణ సంస్థ ఇలా నిలదొక్కుకోవ‌డం..అగ్ర నిర్మాణ సంస్థ‌గా ఎద‌గ‌డం అంటే అంత వీజీ కాదు. కానీ మైత్రీ నిర్మాణ సంస్థ దాన్ని సుసాధ్యం చేసింది.

ఇటీవ‌లే డిస్ట్రిబ్యూష‌న్ రంగంలోకి ఎంట‌ర్ అయింది. అన్ని భాషల చిత్రాల్ని సంస్థ పేరుతో పంపిణీ చేస్తుంది. కోలీవుడ్..బాలీవుడ్ లో సైతం సినిమాలు నిర్మించ‌డానికి రెడీ అయింది. అలా అంచ‌లంచెలుగా మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ అభివృద్ధి పథంలో న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మైత్రీ సంస్థ థియేట‌ర్ బిజినెస్ లోకి ఎంట‌ర్ అయిన‌ట్లు తెలుస్తోంది. అత్యాధునిక సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ ని హైద‌రాబాద్ కి స‌మీపంలోని ఘ‌ట్ కేస‌రిలో నిర్మించింది.

తాజాగా ఆ థియేట‌ర్ ప్రారంభోత్స‌వం నేడు ఘ‌నంగా జ‌రిగింది. ఈ థియేట‌ర్ ని అడ్వాన్స్ టెక్నాల‌జీతో నిర్మించిన‌ట్లు తెలుస్తోంది. హై క్లాస్ పెసిలిటీస్ ఇందులో క‌ల‌వు. ప్రీమియం సీటింగ్.. హైండ్ అండ్ అడ్వాన్స్ డ్ డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్ట‌మ్.. సెంట్ర‌లైజ్డ్ ఎయిర్ క‌డీష‌న్..లోబీ ఏరియా తో ఎంతో విశాలంగా సౌక‌ర్య‌వంతంగా థియేట‌ర్ ని తీర్చిదిద్దిన‌ట్లు తెలుస్తోంది. పార్కింగ్ ఎంతో విశాలంగా క‌నిపిస్తుంది. వాహ‌న‌దారులు ఎలాంటి అసౌక‌ర్యానికి గురి కాకుండా అన్ని ర‌కాల ఏర్పాట్ల‌తో పార్కింగ్ ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది.

మైత్రీ జంగ‌దాంబా థియేట‌ర్ పేరుతో అందుబాటులోకి తెచ్చారు. ప్ర‌స్తుతం నెట్టింట థియేటర్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌గ‌దాంబా థియేట‌ర్ అంటే తెలుగు రాష్ట్రాల్లో గుర్తొచ్చేది వైజాగ్ జ‌గ‌దాంబా థియేట‌ర్. ఈ థియేట‌ర్ కి కొన్ని ద‌శాబ్ధాల చ‌రిత్ర ఉంది. సౌండ్ సిస్ట‌మ్స్ లోనే ఇండియాలోనే నెంబ‌వ‌ర్ థియేట‌ర్ గా పేరుంది. ఇప్ప‌టికీ అదే క్వాలిటీ తో మెయింటెన్ అవుతుంది. తాజాగా ఘ‌ట్ కేస‌రి మైత్రీ థియేట‌ర్ ఏర్పాటు నేప‌థ్యంలో ఇక‌పై తెలంగాణ‌లో జ‌గ‌దాంబా అంతే ఫేమ‌స్ అవుతుంద‌ని చెప్పొచ్చు. అలాగే సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లు.. చివ‌రికి పీవీఆర్ లాంటి మ‌ల్టీప్లెక్స్ లు మూత ప‌డుతోన్న సమ‌యంలో మైత్రీ సంస్థ ఓన్ థియేట‌ర్ ని నిర్మించ‌డం విశేషం.

Tags:    

Similar News