మైత్రీ లైనప్.. అన్నీ హై వోల్టేజ్ కాంబినేషన్లే..
మరో వైపు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైన కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా సినిమాలు నిర్మించడం స్టార్ట్ చేశారు.
టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థగా దూసుకుపోతున్న కంపెనీ మైత్రీ మూవీ మేకర్స్. వీరు ఓ వైపు భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తూ మరో వైపు డిస్టిబ్యూషన్ లోకి కూడా అడుగుపెట్టి మంచి లాభాలు అందుకుంటున్నారు. ఈ ఏడాది హనుమాన్ సినిమా హోల్ తెలుగు స్టేట్స్ రైట్స్ ని మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకొని రిలీజ్ చేయగా భారీ లాభాలు వచ్చాయి.
మరో వైపు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైన కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా సినిమాలు నిర్మించడం స్టార్ట్ చేశారు. మలయాళంలో టోవినో థామస్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమాకి నిర్మాణ భాగస్వామిగా మైత్రీ మూవీ మేకర్స్ ఉంది. అలాగే తమిళంలో అజిత్ హీరోగా గుడ్ బ్యాడ్ అగ్లీ అనే మూవీని పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు.
ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా సిద్ధం అవుతోంది. పుష్ప ది రూల్ మూవీని ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ సుకుమార్ కెరీర్ లోనే కాకుండా మైత్రి వారికి కూడా ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్టు. అలాగే ఎన్ఠీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఒక సినిమాని ఫైనల్ చేశారు. వచ్చే ఏడాది ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే రూపొందనుంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ భాగస్వామిగా ఉంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఇక 2025 లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావచ్చు. అలాగే ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమాని 400 కోట్లకిపైగా బడ్జెట్ తో ఈ నిర్మాణ సంస్థ తెరకెక్కించబోతోంది. ఇప్పటికే ఈ కాంబినేషన్ కు సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధమైంది. ఇక ప్రస్తుతం దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది చివరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.
వీటితో పాటు పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో సిద్ధం అవుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ ఏకంగా అరడజను సినిమాల వరకు బ్యాక్ టూ బ్యాక్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా స్టార్ హీరోలతో వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోన్న చిత్రాలే కావడం విశేషం. త్వరలో బాలీవుడ్ లోకి కూడా వెళ్లేందుకు ఈ ప్రొడక్షన్ హౌస్ నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. రీజనల్ కి పరిమితం కాకుండా భవిష్యత్తులో అన్ని భాషలలో చిత్రాలు చేయాలనే టార్గెట్ తో మైత్రీ టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది.