మూడు నెలల్లోనే సామిరంగని చుట్టేసారు!
తాజాగా కింగ్ నాగార్జున కథానాయకుడిగా నటిస్తోన్న 'నా సామిరంగ' కూడా మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసినట్లు నిన్నటి రోజున తెలిపారు.
టాలీవుడ్ లో అత్యంత వేగంగా షూటింగ్ పూర్తి చేయగల దర్శకుడు ఎవరు? అంటే అందరికీ గుర్తొచ్చేది పూరి జగన్నాధ్. ఆయన మాత్రమే రెండు..మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేయగల దర్శకుడు. ఈ విషయంలో ఓ మేకర్ గా రాజమౌళి సైతం తన వద్ద అసిస్టెంట్ గా కూడా పనిచేయాలని డిసైడ్ అయ్యారు. అంతనంత ఫాస్ట్ గా పూర్తి చేయడం అన్నది ఇంకెవరికీ సాధ్యంకాదని ప్రశంస సైతం ఇచ్చేసారు.
అది కేవలం పూరి జగన్నాధ్ కి మాత్రమే చెల్లింది. ఇలా వేగంగా సినిమాలు చేయడం వల్ల కొంత నెగిటివ్ రిపోర్ట్ కూడా ఉంది. కానీ అది వేరే సంగతి అనుకోండి. తాజాగా కింగ్ నాగార్జున కథానాయకుడిగా నటిస్తోన్న 'నా సామిరంగ' కూడా మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసినట్లు నిన్నటి రోజున తెలిపారు. విశేషం ఏంటి? అంటే ఈ సినిమాకి పనిచేసిన దర్శకుడికి ఇంతకు ముందు దర్శకుడిగా ఎలాంటి అనుభవం లేదు.
కొరియోగ్రాఫర్ గా ఉన్న విజయ్ బిన్నీకి దర్శకుడిగా నాగ్ అవకాశం ఇచ్చి చేసిన సినిమా ఇది. ఈ సినిమా కథ కూడా నాగార్జున అందించారు. అలా విజయ్-నాగ్ కలిసి కేవలం మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసారు. ఆ రకంగా చూసుకుంటే పూరి తర్వాత స్థానం విజయ్ దే. అందులోనూ దర్శకుడిగా తొలి సినిమానే మూడు నెలల్లో పూర్తి చేయడం అంటే విశేషమే. అయితే ఇలా పూర్తి చేయడం వెనుక మరో కారణం నాగార్జున.
ఆయన కూడా అంత గొప్పగా సహకరించడంతోనే సాధ్యమైంది. అలాగే ఈ సినిమాకి సంగీతం కీరవాణి...పాటలు చంద్రబోస రాసారు. వారిద్దరు కూడా టీమ్ తో మమేకం కావడంతోనే ఇదంతా సాధ్యమైందని నాగార్జున సంతోషం వ్యక్తం చేసారు. మూడు నెలల్లో సినిమాని ఎలా పూర్తి చేయాలో పుస్తకం రాసిస్తాం అంటూ స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు నాగ్. ఇక ఈ సినిమాపై టీమ్ అంతా ఎంతో ధీమాగా ఉంది. సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.