ప్రకృతి నడుమ ఇస్మార్ట్ పరువాలు

ఫిట్‌నెస్ వేర్‌లో నభా వేసిన లైట్ బ్లూ కాస్ట్యూమ్ ఆకట్టుకునేలా ఉంది. నది ఒడ్డున నభా వేసిన హ్యాపీ మూడ్‌ లుక్స్‌ చూస్తుంటే.. అసలైన జీవన ఆనందం ఏంటో తెలుస్తుంది.;

Update: 2025-04-14 18:08 GMT
ప్రకృతి నడుమ ఇస్మార్ట్ పరువాలు

తెలుగు, కన్నడ భాషల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న గ్లామర్ డాల్ నభా నటేశ్.. తన నటనతో మాత్రమే కాదు, తన ఫోటోషూట్లతో కూడా హైలైట్ అవుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నభా.. తాజాగా ఓ ఫోటో సిరీస్‌తో మళ్లీ హైలెట్ అయ్యింది. ప్రకృతి అందాల నడుమ ఆమె క్యాజువల్ లుక్.. సింపుల్‌గా ఉండే స్టైల్‌కి కొత్త అర్ధం చెప్పిందనే చెప్పాలి.

 

ఫిట్‌నెస్ వేర్‌లో నభా వేసిన లైట్ బ్లూ కాస్ట్యూమ్ ఆకట్టుకునేలా ఉంది. నది ఒడ్డున నభా వేసిన హ్యాపీ మూడ్‌ లుక్స్‌ చూస్తుంటే.. అసలైన జీవన ఆనందం ఏంటో తెలుస్తుంది. చేతిలో గోగుల్స్ తీసుకుంటూ ఇచ్చిన క్యాండిడ్ హావభావాలు.. ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఎగురుతున్నట్లుగా కనిపిస్తున్న ఫోజ్.. అన్నీ కలిపి ఒక స్వేచ్ఛా పోట్రెయిట్‌ను తలపిస్తున్నాయి. నభా ఫ్యాన్స్ ఈ లుక్స్‌ను చూసి నేచర్ మధ్యలో ఏంజిల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

కెరీర్ విషయానికి వస్తే.. నభా నటేశ్ ఇటీవలే డార్లింగ్ మూవీతో మళ్లీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇస్మార్ట్ శంకర్ మూవీతో యూత్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నభా.. మధ్యలో ఒకసారి గ్యాప్ తీసుకున్నా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆమె ప్రస్తుతం నిఖిల్ సరసన స్వయంభు అనే పీరియాడిక్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో నటిస్తోంది.

ఈ మూవీ కోసం ఆమె తీసుకున్న ట్రైనింగ్, లుక్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నీ ఆమె కెరీర్‌లో కొత్త పేజీగా మారేలా ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో నభా ఓ ఫ్యాషన్ ఐకాన్‌లా ఎదుగుతోంది. ఆమె స్టైలింగ్, ఫొటో పోస్టింగ్ ప్యాటర్న్ యువతను బాగా ఆకర్షిస్తోంది. ఈ ఫోటోలతోనూ అదే ట్రెండ్ కొనసాగుతోంది. జీవించడంలో ఆనందం.. అనే క్యాప్షన్ పెట్టిన ఈ లుక్‌లో నభా ఎంతో ఫ్రీగా కనిపిస్తోంది. ప్రకృతి ప్రేమికుల నుంచి ఫిట్‌నెస్ ఫ్రీక్స్ వరకు ఈ ఫోటోలు బాగా కనెక్ట్ అయ్యాయి.

Tags:    

Similar News