నభా నటేష్.. డెడ్ పూల్ బీట్ అదిరింది!

తెలుగు చిత్ర పరిశ్రమలో నభా నటేష్, గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది

Update: 2024-08-12 16:30 GMT

తెలుగు చిత్ర పరిశ్రమలో నభా నటేష్, గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది. 2019లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ఆమెకు భారీ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో ఆమె చేసిన తెలంగాణ స్టైల్ పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తరువాత ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’ వంటి సినిమాల్లోనూ తన నటనా ప్రతిభను చాటుకుంది.

అయితే, ఆమె జీవితంలో జరిగిన ఒక అనుకోని ఘటన, ఆమె కెరీర్‌లో భారీ బ్రేక్ తీసుకురావడమే కాకుండా, నభా భవిష్యత్తును కాస్త స్లో చేసింది. ఆ ప్రమాదంలో గాయపడిన నభా, రెండు సంవత్సరాల పాటు సినిమా ప్రపంచానికి దూరమవ్వాల్సి వచ్చింది. తాజాగా, ఆమె ఆ గాయాల నుంచి పూర్తిగా కోలుకుని, మళ్లీ తన కెరీర్‌ను పునఃప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది.

ఇటీవల నభా నటేష్ రెండు చిత్రాల్లో నటించింది. అందులో 'డార్లింగ్' సినిమా ఒకటి. ఈ సినిమాలో ఆమె స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడే పాత్రలో కనిపించి, తాను ఎంతవరకు నటించగలదో చూపించింది. ఈ పాత్ర కోసం ఆమె చేసిన కఠిన సాధన, వర్క్‌షాప్‌లు, ట్రైనింగ్ అన్నీ ఆమె ప్రతిభను కొత్త కోణంలో చూపించాయి.

సినిమా ఫలితం ఎలా ఉన్నా, నభా నటేష్ పాత్రకు మాత్రం ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఆమె మళ్లీ తెరపైకి వచ్చిన సందర్భంగా ఇటీవల మీడియాతో మాట్లాడినప్పుడు, నభా తన గ్లామరస్ లుక్స్‌తో మళ్లీ అందరినీ ఆకర్షించింది. ఇక రీసెంట్ గా సోషల్ మీడియాలో ఆమె డ్యాన్స్ వీడియో ఒకటి పోస్ట్ చేసింది. ట్రెండ్ అవుతున్న డెడ్ ఫుల్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేసింది. పొట్టి డ్రెస్‌తో సింపుల్ మేకప్‌తో

ఇక మరోవైపు అమ్మడు పాన్ ఇండియా సినిమా కూడా చేస్తోంది. పీరియాడిక్ జోనర్‌లో తెరకెక్కుతున్న ‘స్వయంభూ’ సినిమాలో నిఖిల్ సరసన ప్రిన్సెస్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఆ పాత్ర తన మునుపటి గ్లామర్‌ను మించి ఉంటుందట. మరి ఈ కొత్త ప్రయాణంలో ప్రేక్షకులను మరోసారి మెప్పిస్తుందో లేదో చూడాలి.

Tags:    

Similar News