నభా నటేష్.. స్టన్నింగ్ గురూ!

పొట్టి డ్రెస్ లో సందడి చేసింది. సింపుల్ మేకప్ తో వచ్చి ఫిదా చేసింది. అందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Update: 2024-07-10 03:45 GMT

ఇస్మార్ట్ పోరిగా హీరోయిన్ నభా నటేష్ తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. రామ్ పోతినేని- పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ వంటి వివిధ సినిమాల్లో నటించింది. అయితే నితిన్ మ్యాస్ట్రోతో చివరగా సందడి చేసిన ఈ బ్యూటీ.. సిల్వర్ స్క్రీన్ పై కనపడి చాలా నెలలు అవుతోంది.

 

అయితే అనుకోకుండా ఓ ప్రమాదానికి గురికావడంతో సినిమాలకు రెండేళ్ల పాటు దూరంగా ఉంది నభా. ఆపరేషన్ కూడా చేయించుకుంది. ఇప్పుడు గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నాక మూవీలపై దృష్టి పెట్టింది. మళ్లీ టాలీవుడ్ లో మెల్లగా బిజీ అవుతోంది. ప్రస్తుతం రెండు చిత్రాల్లో యాక్ట్ చేస్తోంది. డార్లింగ్ మూవీలో ప్రియదర్శి సరసన నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీతో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది నభా నటేష్.

 

డార్లింగ్ మూవీలో నభా నటేష్.. స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్య ఉన్న యువతిగా నటిస్తున్నట్లు ఇప్పటికే ట్రైలర్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. అయితే సినిమాలో నభా తన యాక్టింగ్ తో అదరగొట్టేసినట్లు అర్థమవుతుంది. మూవీ కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్ లకు హాజరై ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. రీఎంట్రీలో ఫస్ట్ మూవీతో మంచి హిట్ కొట్టాలని బాగా కష్టపడ్డట్లు టాక్ వినిపిస్తోంది.

 

అయితే ప్రమోషన్స్ లో భాగంగా నభా నటేష్.. తాజాగా మీడియాతో ఇంటరాక్ట్ అయింది. మీట్ అండ్ గ్రీట్ ను ఏర్పాటు చేసింది. ఆ సమయంలో స్టన్నింగ్ గా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంది. పొట్టి డ్రెస్ లో సందడి చేసింది. సింపుల్ మేకప్ తో వచ్చి ఫిదా చేసింది. అందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నభా నటేష్ ఎవర్ గ్రీన్ బ్యూటీ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

నభా గ్లామరస్ లుక్స్ కు ఫిదా అయ్యామని చెబుతున్నారు. ఆ చూపులకు ఎవరైనా ఫ్లాట్ అయిపోతారని అంటున్నారు. అమ్మడు అదుర్స్ అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. థైస్ షోతో తెగ అట్రాక్ట్ చేస్తోందని చెబుతున్నారు. అయితే డార్లింగ్‌ తో పాటు నిఖిల్ స్వ‌యంభూ మూవీలో కూడా న‌భా న‌టిస్తోంది. పీరియాడిక్ జోనర్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రిన్సెస్ రోల్ లో కనిపించనుంది. మరి నభా ఎలాంటి హిట్లు అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News