కల్కి-2 రెండు, మూడు సినిమాలకు సమానం!
ఇటీవల రిలీజ్ అయిన `కల్కి 2898` ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే.
ఇటీవల రిలీజ్ అయిన `కల్కి 2898` ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన మరో చిత్రంగా రికార్డు సృష్టించింది. పాన్ ఇండియాలో ఈ సినిమా ఓ కొత్త చరిత్రను రాసింది. కథ, కథనాల పరంగా సినిమాకు అన్ని భాషల్లోనూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. ఇలాంటి కంటెంట్ ని నాగ్ అశ్విన్ థన మేథస్సుతో తెరకెక్కించన వైనానికే లెజెండ్స్ అంతా ఫిదా అవుతున్నారు. భారీతీయ చిత్ర పరిశ్రమ ఇలాంటి ఆణిముత్యాల్ని మరిన్ని వెతికి తీయాలంటూ నీరాజనాలు గుప్పించింది.
దీంతో `కల్కి 2`పై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. మొదటి భాగంలో హీరో అమితాబచ్చన్ అయితే? రెండవ భాగంలో ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుంది? ప్రతి నాయకుడు పాత్ర పోషించిన కమల్ విశ్వ రూపంలో ఎలా ఉండబోతుంది? ఇలా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో కల్కీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండవ భాగాన్ని ఉద్దేశించి నాగ్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పార్ట్ -2 ఒక్కటే రెండు, మూడు సినిమాలకు సమానంగా ఉంటుందన్నారు.
అంటే రెండవ భాగాన్ని ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు? అన్నది అద్దం పడుతుంది. సినిమా నిడివి కూడా మూడు గంటలు పైనే ఉంటుందా? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. అలాగే కథలో చాలా కొత్త పాత్రలు యాడ్ అయ్యే అవకాశం ఉంటుందని సమాచారం. పాత పాత్రలతో పాటు కొత్త పాత్రలో సినిమా స్పాన్ ఇంకా పెరుగుతుంది. అందుకోసం నాగ్ అశ్విన్ కూడా ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. తొందర పడి చేసే చిత్రం కాదు.
మెల్లగా చేయాల్సిన చిత్రంగా అభివర్ణించారు. ఒక్క భాగమే రెండు..మూడు సినిమాలకు ధీటుగా ఉంటుందన్నారు? అంటే రెండవ భాగాన్ని ఇంకేస్తాయిలో చూపిస్తాడు? అన్నది ఊహకి కూడా అందనిది. ఇక నుంచి ఈ సినిమాపై పనుల్లోనే నిమగ్నమవుతానన్నారు. అంటే స్టోరీ పరంగా రెడీ ఉన్నా? ఇంకా దాని తుది మెరుగులు దిద్దాలన్నది ఆయన అభిప్రాయంగా కనిపిస్తుంది.