కల్కి మహానటికి వింత అనుభవం..!

కల్కి సినిమాలో బుజ్జికి డబ్బింగ్ చెప్పింది కీర్తి సురేష్. రీసెంట్ ఇంటర్వ్యూలో ఆమె కల్కిలో తనకు నాగ్ అశ్విన్ ఒక పాత్ర ఇచ్చారని కానీ అది ఎందుకో అంతగా నచ్చలేదు.

Update: 2024-11-30 16:30 GMT

కీర్తి సురేష్ ఎంత మంచి నటి అన్నది అందరికీ తెలిసిందే. మహానటితో ఆమె ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని కూడా అందుకున్నారు. నాగ్ అశ్విన్ ఆమెలో ఏం చూసి సావిత్రిగా కీర్తి ని తీసుకున్నాడో కానీ మహానటిలో కీర్తి నటించలేదు జీవించేసింది అనేట్టుగా అదరగొట్టేసింది. ఐతే ఆ క్లోజ్ నెస్ తోనే మానటి తర్వాత నాగ్ అశ్విన్ ప్రొడ్యూస్ చేసిన జాతిరత్నాలు సినిమాలో కూడా కీర్తి సురేష్ క్యామియో చేసింది. ఆ తర్వాత మళ్లీ కల్కిలో కూడా తన వాయిస్ తో మెప్పించింది.

కల్కి సినిమాలో బుజ్జికి డబ్బింగ్ చెప్పింది కీర్తి సురేష్. రీసెంట్ ఇంటర్వ్యూలో ఆమె కల్కిలో తనకు నాగ్ అశ్విన్ ఒక పాత్ర ఇచ్చారని కానీ అది ఎందుకో అంతగా నచ్చలేదు. ఆ విషయం తనకు చెప్పేద్దామని అనుకునే టైంలోనే బుజ్జికి డబ్బింగ్ చెప్పెయ్ అన్నారు. ఐతే అందుకు ఓకే చెప్పేసా. తాను ఇప్పటివరకు చెప్పిన డబ్బింగ్ లో బుజ్జి పాత్ర కు చెప్పిన డబ్బింగ్ చాలా స్పెషల్ అని అన్నది కీర్తి సురేష్.

కల్కికి పనిచేయడం చాలా సరదాగా అనిపించింది. అది ఒక మెమొరబుల్ ఎక్స్ పీరియన్స్ అని అన్నది కీర్తి సురేష్. కల్కి 2 లో కోసం కూడా తాను ఎదురుచూస్తున్నానని అన్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ బేబీ జాన్ సినిమాలో నటిస్తుంది. ఈ ఇయర్ క్రిస్ మస్ కి సినిమా రిలీజ్ అవుతుంది.

ఇక ఈమధ్యనే తన బోయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన కీర్తి సురేష్ వచ్చే నెలలో పెళ్లికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్ అప్పటి నుంచి తన యాక్టింగ్ టాలెంట్ తో ఎంతోమంది ఫ్యాన్స్ ని సంపాదించింది. మహానటితో సౌత్ మొత్తమే కాదు నార్త్ లో కూడా పాపులారిటీ తెచ్చుకుంది. బాలీవుడ్ లో తొలి సినిమాగా బేబీ జాన్ చేస్తుంది కీర్తి సురేష్. బీ టౌన్ నీళ్లు పడ్డాయో లేదో ఆ సినిమా కోసం కీర్తి సురేష్ ఒక రేంజ్ గ్లామర్ షో చేస్తుంది. సౌత్ లో ఇన్ని సినిమాలు చేసినా చేయని స్కిన్ షో బేబీ జాన్ కోసం చేసిందని అనిపిస్తుంది. ఐతే త్వరలో పెళ్లంటూ ట్విస్ట్ ఇచ్చిన కీర్తి సురేష్ పెళ్లి తర్వాత కెరీర్ కొనసాగిస్తుందా.. ఎప్పటిలానే సినిమాలు చేస్తుందా అన్న దానికి మాత్రం ఆన్సర్ తెలియట్లేదు.

Tags:    

Similar News