కృష్ణుడిగా మహేష్ నటిస్తే ఆల్‌టైమ్ రికార్డ్ : నాగ్ అశ్విన్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు సొంతం చేసుకున్న కల్కి సినిమాలో శ్రీకృష్ణుడి పాత్ర ఉంది. కానీ ఆ పాత్రలో నటించింది ఎవరు అనే విషయాన్ని నాగ్ అశ్విన్ రివీల్ చేయలేదు. కల్కి సినిమాలో శ్రీకృష్ణుడి పాత్ర గురించి ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ కల్కి సినిమాలో శ్రీకృష్ణుడి లుక్‌ను రివీల్ చేయాలని అనుకోవడం లేదు. కృష్ణుడి ఫేస్‌ను రివీల్ చేయడం ద్వారా సినిమా దారి మారుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నాగ్ అశ్విన్ ఇంకా మాట్లాడుతూ... ఒక వేళ సినిమాలో కృష్ణుడి పాత్ర ఫుల్ లెంగ్త్ ఉంటే మహేష్ బాబు గారు యాక్ట్ చేస్తే ఫేస్ చూపిస్తాను. ఒక వేళ మహేష్ బాబు గారు కృష్ణుడిగా కనిపిస్తే కచ్చితంగా ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్ అవుతాయని తాను నమ్ముతున్నాను అంటూ నాగ్ అశ్విన్ పేర్కొన్నాడు. కల్కి 2 సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది. ప్రభాస్ డేట్ల కోసం ఎదురు చూస్తున్నట్లుగా గతంలో ప్రకటించిన నాగ్ అశ్విన్ అనూహ్యంగా తన తదుపరి సినిమాను బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తో చేయబోతున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఇటీవల కల్కి 2898 ఏడీ సినిమాను జపాన్‌లో ప్రమోట్ చేయడం కోసం వెళ్లిన నాగ్ అశ్విన్ అక్కడ పలు ఆసక్తికర విషయాలను చెప్పాడు. ముఖ్యంగా సినిమాపై వారు చూపిస్తున్న అభిమానంను చెప్పే విధంగా పలు ఫోటోలు వీడియోలను షేర్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా సినిమా అప్‌డేట్స్‌ను ఇచ్చే నాగ్ అశ్విన్ కచ్చితంగా జపాన్‌లో కల్కి 2898 ఏడీ సినిమా సంచలనం సృష్టిస్తుంది అనే నమ్మకంతో ఉన్నాడు. ముత్తు సినిమా కలెక్షన్స్ రికార్డ్‌ను పాతికేళ్ల తర్వాత ఆర్‌ఆర్‌ఆర్ బ్రేక్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డ్‌ను కల్కి సినిమాతో ప్రభాస్ బ్రేక్ చేస్తాడా అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా చూస్తున్నారు.
జనవరి మొదటి వారంలోనే కల్కి 2898 ఏడీ సినిమా జపనీస్ భాషలో ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతోంది. అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే ఇండియన్ సినిమా స్థాయి అంతర్జాతీయ స్థాయిలో మరింత పెరగడం ఖాయం. జపాన్‌లో సినిమా హిట్ కావడానికి కొన్ని పెరామీటర్స్ ఉంటున్నాయి. వాటికి తగ్గట్టుగా కల్కి సినిమా ఉంటుంది అనే నమ్మకంను పలువురు వ్యక్తం చేస్తున్నారు. కల్కి హిట్ అయితే కల్కి 2 ను సైతం జపనీస్ భాషలో భారీ ఎత్తున విడుదల చేసే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. ప్రభాస్, అమిబాబ్ బచ్చన్, దీపికా పదుకునే తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ గెస్ట్‌గా కనిపించగా, కీర్తి సురేష్ వాయిస్ తో సినిమాలో భాగం అయ్యింది.