కల్కి2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి, ఆయన టాలెంట్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.;

డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి, ఆయన టాలెంట్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో ఇండస్ట్రీలోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన నాగి, మొదటి సినిమాతోనే తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. రెండో సినిమాగా సావిత్రి జీవిత కథను మహానటి పేరుతో తెరకెక్కించి నెక్ట్స్ లెవెల్ లో తన సత్తా చాటారు. మహానటి తర్వాత నాగి ఎవరితో సినిమా చేస్తాడా అని అందరూ అనుకుంటున్న టైమ్ లో ప్రభాస్ తో సినిమాను అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చారు.
గతేడాది రిలీజైన కల్కి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన సత్తాను చాటిన నాగి, ఆ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి ఎన్నో రికార్డులు సృష్టించారు. కల్కి రిలీజై రూ.1000 కోట్ల మార్క్ ను అందుకున్నప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి2 ఎప్పుడెప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తూ ఆ సినిమాకు సంబంధించిన ఎవరు కనిపించినా అడుగుతూ వస్తున్నారు.
నాగ్ అశ్విన్ ఏదైనా పబ్లిక్ ఈవెంట్స్ కు వెళ్లినా బయట ఎక్కడైనా కనిపించినా ఆయన్ని కూడా కల్కి2 ఎప్పుడనే ప్రశ్నని అడుగుతూనే ఉన్నారు. రీసెంట్ గా తన మొదటి సినిమా ఎవడే సుబ్రమణ్యం రీరిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ లో కూడా నాగిని ఇదే ప్రశ్న అడిగారు. ఇప్పుడు నాగి తన ఫ్యామిలీతో కలిసి తిరుమల ఆలయాన్ని సందర్శించి స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
దర్శనం చేసుకుని గుడి బయటకు రాగానే అక్కడికి భారీ ఎత్తున ఫ్యాన్స్ గుంపు గూడి నాగితో సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. ఈ సందర్భంగా అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న కల్కి2 గురించి మీడియాతో మాట్లాడారు నాగి. చాలా కాలం తర్వాత తిరుమల వచ్చి స్వామి వారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్న నాగి, తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ బావుండాలని దేవున్ని కోరుకున్నట్టు తెలిపాడు. కల్కి2 గురించి మాట్లాడుతూ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయని, సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి చాలా టైమ్ పడుతుందని తెలిపారు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ ఇయర్ ఎండింగ్ నుంచి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి షూటింగ్ ను మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం సంతోషంలో మునుగితేలుతున్నారు.
ఇదిలా ఉంటే రీసెంట్ గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోని 400 ఎకరాల అడివిని తెలంగాణ ప్రభుత్వం నిర్మూలిస్తుండగా, దానిపై కూడా నాగి రెస్పాండ్ అయిన సంగతి తెలిసిందే. అడవులను నిర్మూలించి అక్కడ నివసిస్తున్న వన్య ప్రాణులను, పక్షులను నాశనం చేయొద్దని, అభివృద్ధే కావాలనుకుంటే వేరే ఏరియాల మీద ఫోకస్ చేస్తే బావుంటుందని నాగి అభిప్రాయపడ్డారు.