చైతూ రేసింగ్ ఫీవర్
ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో తన రేసింగ్ జట్టుతో తీసుకున్న ఫోటోలు షేర్ చేయడం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది.
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్యకు బైక్స్, కార్స్ అంటే ఎనలేని ఇష్టమని చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు. అప్పుడప్పుడు సోలో రైడ్స్ తో కూడా అతను వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇక సోషల్ మీడియాలో రీసెంట్ గా ఒక స్పెషల్ మూమెంట్స్ తో తనకు ఇష్టమైన రేసింగ్ గురించి వివరణ ఇచ్చారు. ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో తన రేసింగ్ జట్టుతో తీసుకున్న ఫోటోలు షేర్ చేయడం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది.
ఈ సీజన్ ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ 2024లో చైతూ ఆధ్వర్యంలోని హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీ ప్రదర్శనలో ఒక ప్రత్యేకమైన ముద్ర వేసింది. చైతూ ఈ ప్రయాణాన్ని ప్యాషన్, మరియు మరపురాని క్షణాలతో నిండి ఉందని అభివర్ణించారు. ప్రస్తుతం ఫార్ములా 4 డ్రైవర్ టైటిల్ రేస్‌లో ఉన్న బ్లాక్ బర్డ్స్ జట్టు విజయం సాధించడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ పోస్టులో చైతన్య తన జట్టుతో కలిసి దిగిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
మొదటి ఫోటోలో చైతన్య ఒక ఫార్ములా 4 రేసింగ్ కార్ పక్కన నిలబడి, స్టన్ అయ్యేక పోజ్ ఇచ్చారు. ఈ కారు డిజైన్ స్టైలిష్‌గా ఉండి, జట్టు ప్యాషన్‌కు గుర్తుగా నిలుస్తుంది. చైతూ జట్టు సభ్యులు అంతా పక్కన నిలబడి, వారి విజయపరంపరను సంతోషంగా పంచుకుంటున్నారు. రెండవ ఫోటోలో బ్లాక్ బర్డ్స్ జట్టు సభ్యులందరూ కలిసి గ్రాండ్ ఫినాలేకు సన్నాహాలు చేస్తూ, ఒక గ్రూప్ ఫోటోలో కనిపిస్తున్నారు. ఈ ఫోటోలోని అందరి ముఖాలపై విజయంతో కూడిన ఆనందం చూడవచ్చు. ఇది చైతూ జట్టులోని ఐక్యతను, ఆత్మవిశ్వాసాన్ని మరింతగా ప్రతిబింబిస్తుంది.
మూడవ ఫోటోలో రేసింగ్ ట్రాక్‌లో ఫార్ములా 4 కార్లు వేగంగా పరుగులు తీయడం చూడొచ్చు. ఈ క్షణాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే విధంగా ఉన్నాయి. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ రేసింగ్ జట్టు విజయపరంపర సాధించే దిశగా వేగంగా దూసుకుపోతుండగా, ఈ ఫోటో రేసింగ్ జట్టు స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. ఇక ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌లో మొత్తం ఆరు జట్లు పోటీ పడుతుండగా, హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్‌తో పాటు కోల్‌కతా రాయల్ టైగర్స్, చెన్నై టర్బో రైడర్స్, స్పీడ్ డెమోస్ దిల్లీ, గోవా ఏసెస్ జేఏ, బెంగళూరు స్పీడ్ స్టార్స్ వంటి బలమైన జట్లు పోటీలో పాల్గొన్నాయి.
ఈ పోటీలో అగ్రస్థానంలో నిలిచేందుకు జట్లు పోటీ పడ్డయు. చైతూ టీమ్ విజయం సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయని అభిమానులు నమ్ముతున్నారు. చివరగా, ఈ పోస్ట్‌లోని హ్యాష్‌ట్యాగ్‌లు మరియు చైతూ రాసిన మాటలు జట్టు పట్ల ఆయనకున్న ప్యాషన్‌ను వ్యక్తపరుస్తున్నాయి. “స్పీడ్ మీట్స్ స్పిరిట్” అని పేర్కొంటూ, చైతూ ఈ పోటీలో తన స్ఫూర్తిని పంచుకున్నారు. ఇక ప్రస్తుతం చైతూ తండేల్ సినిమాతో సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుంది.