ఫోటో స్టోరి: చై ఏంటి డాన్‌లా దిగాడు

యువ సామ్రాట్ చై అక్కినేని డాషింగ్ లుక్ .. అత‌డి ఆత్మ‌ విశ్వాసాన్ని ఎలివేట్ చేస్తోంది. బ్రాండ్ ఈవెంట్‌లో నిజంగా షో స్టాప‌ర్ గా మారాడు చైత‌న్య‌.

Update: 2024-12-01 17:34 GMT

సంద‌ర్భం ఏదైనా కానీ స‌డెన్ గా లుక్ ఛేంజ్ చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు చై అక్కినేని. శోభిత ధూళిపాల‌తో పెళ్లికి ముందు అత‌డి కొత్త లుక్ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఈవెంట్ లో అత‌డు స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చినా కానీ, చూడ‌టానికి డాన్ లా ఉన్నాడు. డాన్ పాత్ర‌ధారి అయిన‌ షారూఖ్ కి వార‌సుడిలాగా క‌నిపిస్తున్నాడు.

 

యువ సామ్రాట్ చై అక్కినేని డాషింగ్ లుక్ .. అత‌డి ఆత్మ‌ విశ్వాసాన్ని ఎలివేట్ చేస్తోంది. బ్రాండ్ ఈవెంట్‌లో నిజంగా షో స్టాప‌ర్ గా మారాడు చైత‌న్య‌. ముఖ్యంగా అత‌డు ఎంపిక చేసుకున్న డిజైన‌ర్ మ‌ఖ‌మ‌ల్ బ్లేజ‌ర్ అత‌డి ఆక‌ర్ష‌ణ‌ను ప‌దింత‌లు పెంచింద‌ని చెప్పాలి. ఈ బ్లేజ‌ర్ కి త‌గ్గ‌ట్టే హెయిర్ స్టైల్.. ఆహార్యం ప్ర‌తిదీ యాప్ట్ గా కుదిరాయి.

 

తండేల్ కోసం అత‌డు త‌న రూపాన్ని పూర్తిగా మార్చ‌డంతో అది ఇక్క‌డ అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు ఆ సినిమా లుక్కుతోనే ఈ బ్లేజ‌ర్ లో ప్ర‌వేశించడంతో అది మెర్జ్ అయిన తీరు నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అత‌డు తండేల్ లో మ‌త్స్య‌కారుడిగా న‌టించాడు. కానీ ఇక్క‌డ డాన్ లాగా క‌నిపిస్తున్నాడు. స‌రికొత్త వ‌స్త్ర‌ధార‌ణ‌తో గెట‌ప్ మార్చి.. పెరిగిన గ‌డ్డం... హెయిర్ క‌ట్.. టోన్డ్ బాడీ అప్పియ‌రెన్స్ చూడ‌గానే స్ట‌న్న‌ర్ అనిపిస్తున్నాడు. ఈరోజు షో స్టాప‌ర్ నాగ‌చైత‌న్య మాత్ర‌మే.

 

అత‌డు ఈ లుక్ తో ఏదైనా సినిమా చేస్తాడేమో చూడాలి. చాలా కాలంగా మాస్ ఇమేజ్ కోసం పాకులాడుతున్న చైత‌న్య‌కు తండేల్ ఆ లోటు తీరుస్తుంది. త‌దుప‌రి అభిమానులు కోరుకున్న‌ట్టే ఒక డాన్ లాగా న‌టిస్తాడేమో చూడాలి. డిసెంబ‌ర్ 4న నాగ‌చైత‌న్య‌- శోభిత ధూలిపాళ జంట పెళ్లి హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోస్ లో జ‌ర‌గ‌నుంది.

Tags:    

Similar News