త్రోబ్యాక్: దిండు చైతన్యకు మొదటి భార్య
అక్కినేని నాగచైతన్య- సమంత రూత్ ప్రభు జంట ప్రేమ పెళ్లి బ్రేకప్ అవ్వడం అభిమానులను షాక్ కి గురి చేసిన సంగతి తెలిసిందే.
అక్కినేని నాగచైతన్య- సమంత రూత్ ప్రభు జంట ప్రేమ పెళ్లి బ్రేకప్ అవ్వడం అభిమానులను షాక్ కి గురి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎవరి దారిలో వారు స్వేచ్ఛగా ఉన్నారు. నాగచైతన్య ఇటీవలే తెలుగమ్మాయి శోభిత ధూళిపాలను పెళ్లాడారు. అతడు పూర్తిగా కొత్త జీవితాన్ని ఆస్వాధిస్తున్నాడు. సమంత ప్రస్తుతం కెరీర్ పరమైన బిజీలో ఉన్నారు.
ఇంతలోనే సామ్ పాత ఇంటర్వ్యూ నుంచి ఒక క్లిప్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. ఈ వీడియోలో సమంత చేసిన వ్యాఖ్యలు మరోసారి హా* టాపిగ్గా మారాయి. చై బెడ్ పై దిండును తన మొదటి భార్యగా భావించే అలవాటు గురించి సమంత ఫిర్యాదు చేసింది. 2019లో ఫీట్ అప్ విత్ ది స్టార్స్ (తెలుగు) కార్యక్రమంలో సమంత మాట్లాడుతూ.. చైతన్యతో తన బంధం ఎలా ఉందో వెల్లడించింది. వివాహం తర్వాత వారి రిలేషన్‌లో ఏమి మారిందని హోస్ట్ ప్రశ్నించగా, చాలా సరదాగా మాట్లాడేసిన సమంత.. ``దిండు చైతన్యకు మొదటి భార్య. నేను ముద్దు పెట్టుకోవాల్సి వచ్చినా దిండు ఎప్పుడూ మా మధ్యనే ఉంటుంది. ఇప్పటికి ఇది చాలు. నేను చాలా విషయాలు చెప్పేశాను`` అంటూ వ్యాఖ్యానించింది.
కారణం ఏదైనా కానీ చై- సామ్ జంట విడిపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ బ్రేకప్ పై చాలా ఊహాజనిత కథనాలు వెలువడ్డాయి. సమంత బోల్డ్ ఇమేజ్ గురించి అక్కినేని కుటుంబంలో అనుమతించలేదని, దానిని సమంత వ్యతిరేకించిందని కథనాలొచ్చాయి.
నాగ చైతన్య -శోభితా ధూళిపాళ 4 డిసెంబర్ 2024న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో సాంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఈ వేడుక కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నడుమ అందంగా సాగింది. ఇక బ్రేకప్ తర్వాత సమంత మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొన్నా చివరికి దాని నుంచి కోలుకుంటోంది. చైతూ నటించిన తండేల్ ఫివ్రవరి 7 విడుదల కానుంది.