నాగచైతన్య 24 భారీ సెట్ లో 15రోజులు!

`తండేల్` విజ‌యంతో యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య పుల్ స్వింగ్లో ఉన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-04-16 06:33 GMT
Naga Chaitanya And  Karthik Dandu Movie Shoot begin

`తండేల్` విజ‌యంతో యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య పుల్ స్వింగ్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అక్కినేని హీరోల్లో తొలి సెంచ‌రీ న‌మోదు చేసిన హీరోగా చ‌రిత్ర సృష్టించాడు. దీంతో త‌దుప‌రి సినిమా విష‌యంలో చైత‌న్య మ‌రింత కేర్ పుల్ గా ఉన్నాడు. ప్ర‌స్తుతం త‌న 24వ చిత్రం `విరూపాక్ష` ఫేం కార్తీక్ దండు ద‌ర్శ‌క త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొద్ది భాగం షూటింగ్ పూర్త‌యింది.

తాజాగా కొత్త షెడ్యూల్ హైద‌రాబాద్ లో ప్రారంభ‌మైంది. ఈ షెడ్యూల్ కోసం ప్ర‌త్యేకంగా భారీ సెట్ నిర్మిం చారు. ఈ షెడ్యూల్ షూటింగ్ అంతా అందులోనే చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. హీరో, హీరోయిన్ తో పాటు ప్ర‌ధాన తార‌గ‌ణంపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. సినిమాలో ఈ స‌న్నివేశాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. నాగ‌చైత‌న్య చాలా కొత్త‌గా క‌నిపిస్తాడ‌ని, నెవ‌ర్ బిఫోర్ లుక్స్ కొన్ని ఉంటాయ‌ని అంటున్నారు.

ఇంత వ‌ర‌కూ నాగ‌చైత‌న్య హార‌ర్ ఆధ్యాత్మిక అంశాల‌తో ముడిప‌డిన చిత్రాలు చేయ‌లేదు. ఈ చిత్రం ఓ మిస్టిక‌ల్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతుంది. దీంతో ఈ సినిమా చైత‌న్య‌కు కొత్త అనుభూతిని పంచుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ చైత‌న్య అంటే కేవ‌లం ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ మాత్ర‌మే ఉండేది. ఈ సినిమా త‌ర్వాత కొత్త ఇమేజ్ యాడ్ అవుతుంది. `విరూపాక్ష`తో కార్తీక్ దండు భారీ విజ‌యం అందుకున్న సంగ‌తి తెలిసిందే.

అప్ప‌టికే ప్లాప్ ల్లో ఉన్న మెగా మేన‌ల్లుడు సాయిదుర్గ తేజ్ కి ఈ సినిమా ఊపిరి పోయేడ‌మే కాదు..ఏకంగా 100 కోట్ల క్ల‌బ్ లో చేరిపోయింది. ఆ న‌మ్మ‌కంతోనే నాగ‌చైత‌న్య పిలిచి మ‌రీ కార్తీక్ కి ఛాన్స్ ఇచ్చాడు. ఈసి నిమాకు `కాంతార` ఫేం అజ‌నీష్ లోక్ నాధ్ సంగీతం హైలైట్ గా ఉంటుంద‌ని అంచ‌నాలున్నాయి. సినిమాకు ఆర్ ఆర్ అద్బుతంగా ఉంటుద‌ని చిత్ర వ‌ర్గాలు ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి.

Tags:    

Similar News