పోర్షే కార్ లో చైతూ.. చిన్నారులతో క్యూట్ క్యూట్ గా..
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్యకు కార్స్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే.;

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్యకు కార్స్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఇప్పటికే తన గ్యారేజ్ లో బ్లాక్ మెర్సిడెస్-బెంజ్ G63 AMG, రెడ్ కలర్ ఫెరారీ 488 GTBతో సహా అనేక రకాల విదేశీ కార్లు చేర్చుకున్నారు. కొద్ది రోజుల క్రితం.. పోర్షే 911 GT3 RS స్పోర్ట్స్ కార్ ను కూడా కొనుగోలు చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా తన ఫేవరేట్ పోర్షే కారులో నాగ చైతన్య చక్కర్లు కొట్టారు. రిలాక్స్ మోడ్ లో కనిపిస్తున్న ఆయన.. కారులో తిరిగారు. అదే సమయంలో ఆయన కారు వద్దకు కొందరు చిన్నారులు వచ్చారు. తాము తండేల్ మూవీ చూసినట్లు తెలిపారు. వెంటనే చైతూ.. ఆ పిల్లల పేర్లతో పాటు ఏ క్లాస్ చదువుతున్నారో అడిగారు. ఆ తరవాత బై చెప్పి వెళ్ళిపోయారు.
అందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిల్లలతో చైతూ కన్వర్జేషన్ క్యూట్ గా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సింప్లిసిటీ కా బాప్ అని చెబుతున్నారు. తమ సోషల్ మీడియా వాల్స్ లో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అయితే వీడియోలో ఓ పిల్లవాడు.. అన్న మళ్ళీ సండే కలుద్దాం అంటూ చెప్పడం అందరినీ ఆకర్షిస్తోంది.
ఇక చైతూ సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా తండేల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు మత్స్యకారుల జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఆ మూవీ.. దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
అయితే ఆ సినిమా తర్వాత నాగ చైతన్య విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండుతో వర్క్ చేస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఆ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే మూవీ స్క్రీన్ ప్లేపై సుకుమార్ కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది. మిస్టీక్ హారర్ థ్రిల్లర్ గా మూవీ ఉండనున్నట్లు.. వచ్చే ఏడాది రిలీజ్ కానున్నట్లు సమాచారం.
మరోవైపు.. తన లాండ్ మార్క్ 25వ మూవీ కిషోర్ అనే కొత్త దర్శకుడితో నాగ చైతన్య చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కిషోర్.. చైతూ కథ చెప్పారట. స్టొరీ బాగా నచ్చడంతో వెంటనే హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. మరి కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక సెట్లను నిర్మిస్తున్నట్లు వినికిడి.