హోట‌ల్ బిజినెస్‌లో ఏడాదికి 12కోట్ల ఆదాయం తీస్తున్న హీరో?

టాలీవుడ్ లో చాలామంది సెల‌బ్రిటీలు రెస్టారెంట్స్, హోట‌ల్ వ్యాపారాల్లో ఉన్నారు.

Update: 2024-09-03 05:14 GMT

టాలీవుడ్ లో చాలామంది సెల‌బ్రిటీలు రెస్టారెంట్స్, హోట‌ల్ వ్యాపారాల్లో ఉన్నారు. అయితే వీరంద‌రికీ స్ఫూర్తి కింగ్ నాగార్జున‌. నేడు పెరుగుతున్న జ‌నాభా, బిజీ లైఫ్ స్టైల్ కార‌ణంగా హోట‌ల్ రంగం పెరుగుతోందే కానీ త‌ర‌గ‌డం లేదు. హైద‌రాబాద్ స‌హా దేశ‌విదేశాల్లో రెస్టారెంట్ల వ్యాపారంలో కింగ్ నాగార్జున గ‌ణ‌నీయ‌మైన ఆదాయాన్ని ఆర్జిస్తున్న సంగ‌తి తెలిసిన‌దే.

ఇటీవ‌ల నాగార్జున ఎన్.క‌న్వెన్ష‌న్ ని `హైడ్రా` కూల్చివేయ‌గా, అత‌డి వ్యాపారాల గురించి మ‌రోసారి విస్త్ర‌తంగా చాలా చ‌ర్చ సాగింది. కేవ‌లం ఎన్ క‌న్వెన్ష‌న్ నుంచి ఏడాదికి 100 కోట్లు పైగా ఆదాయం వ‌స్తోంద‌ని ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కులు మీడియా ముందు లెక్క‌లు చెప్పారు. హైద‌రాబాద్ లో ప‌బ్ అండ్ రెస్టారెంట్ బిజినెస్.. హాస్పిటాలీటీ రంగంలోను కింగ్ నాగార్జున పెట్టుబ‌డుల గురించి తెలిసిందే. ఆయ‌న ఏది చేప‌ట్టినా అది బంగార‌మే.

అయితే తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా ఇప్పుడు నాగ‌చైత‌న్య కూడా ఫుడ్ బిజినెస్ లో రాణించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అత‌డు 2022లో హైద‌రాబాద్ లో `షోయు` పేరుతో `క్లౌడ్ కిచెన్`ని ప్రారంభించాడు. ఇది రెగ్యుల‌ర్ హోట‌ల్స్, రెస్టారెంట్ల‌కు విభిన్న‌మైన‌ది. ఆర్డ‌ర్స్ మేర‌కు సౌత్ ఆసియ‌న్ వంట‌కాల‌ను వండి ప‌ర్యావ‌ర‌ణ స‌హితంగా ప్యాక్ చేసి పంపించే వ్యాపారం. ఇది న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు విప‌రీతంగా క‌నెక్ట‌యింద‌ని చెబుతున్నారు. దీనిద్వారా రోజుకు 3-5 ల‌క్ష‌ల ఆదాయం వ‌స్తోంద‌ని, ఏడాదికి 12 కోట్ల ట‌ర్నోవ‌ర్ చేస్తున్నార‌ని టాక్ ఉంది. కొంత ఖ‌రీదు ఉన్నా కానీ, క్లౌడ్ కిచెన్ షోయు సెల‌బ్రిటీ వ‌ర‌ల్డ్ లో బాగా పాపుల‌రైపోయింది.

నాగ‌చైత‌న్య‌ న‌టుడిగా కొన‌సాగుతూనే వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాడు. అందులోనూ ఫుడ్ బిజినెస్ అంటే అత‌డికి చాలా ఫ్యాష‌న్. క్లౌడ్ కిచెన్ ప్రారంభించిన అనంత‌రం చైత‌న్య విదేశీ వంట‌కాల గురించి చెబుతుంటే చెఫ్ మాస్ట‌ర్లే నొరెళ్ల‌బెట్టారు. అంత నాలెడ్జ్ పుడ్ రంగంలో ఉంది. త‌న ఫ్యాష‌న్ ని క్లౌడ్ కిచెన్ రూపంలో చూపిస్తున్నాడు. ఏడాదికి 12 కోట్ల ఆదాయం అర్జిస్తున్నాడు. హైదరాబాద్ మాదాపూర్‌లో 2022లో క్లౌడ్ కిచెన్ ప్రారంభించాడు. ఇది గౌర్మెట్ సౌత్-ఈస్ట్-ఆసియన్ వంటకాలకు ప్రసిద్ధి. ఇక్క‌డ అన్ని ర‌కాల ఏషియ‌న్ వంట‌కాలు ల‌భిస్తాయి. మార్కెట్ లో దీనికి మంచి పేరుంది. ఖ‌రీదైన ఆర్డ‌ర్లు అన్నీ చైత‌న్య కిచెన్ నుంచే వెళ్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ క్లౌడ్ కిచెన్ హైదరాబాద్ లో ఉన్న టాప్-10 రెస్టారెంట్స్ లో ఒకటిగా ఎదిగింది. త‌క్కువ స‌మ‌యంలో అత్యున్న‌త పురోగ‌తిని షోయు సాధించింది. హైద‌రాబాద్ లాంటి సిటీలో క్లౌడ్ కిచెన్ కి మంచి పోటీ ఉంది. దాన్ని త‌ట్టుకుని చైత‌న్య కిచెన్ బిజినెస్ టాప్ -10లో నిలిచింది. చైతూ న‌టిస్తున్న `తండేల్` త్వ‌ర‌లో విడుద‌ల‌కు రానుంది. చందు మొండేటి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Tags:    

Similar News