అమ్మాయిలు తెలుగు మాట్లాడితే చైతన్యకు అంతిష్టమా!
యువ సామ్రాట్ నాగచైతన్య కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. తాతయ్య ఏఎన్నార్, తండ్రి నాగార్జున వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు
యువ సామ్రాట్ నాగచైతన్య కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. తాతయ్య ఏఎన్నార్, తండ్రి నాగార్జున వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. లవర్ బోయ్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రోఫెషనల్ గా చైతన్య హైట్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అలాగే చైతన్య ఎంతో తెలి వైన విద్యార్ధి. చిన్న నాటి నుంచి చదువుల్లో ముందుండేవారు. విదేశాల్లో మాస్టర్స్ చదువుకున్నాడు.
సాధారణంగా స్టార్ కిడ్స్ అంటే చదువు అబ్బని వారే కనిపిస్తారు. కానీ చైతన్య అలాంటి వాళ్లకు భిన్నం. ఎంతో తెలివైన విద్యార్ది. మంచి బిజినెస్ మైండెడ్. విదేశాల్లో చదువుకున్నా తెలుగు ఎంతో చక్కాగా మాట్లాడుతాడు. తాజాగా అతడికి తెలుగు అంటే ఎంత పిచ్చి? అన్నది శోభిత రివీల్ చేసిన సందర్భంగా తెలిసింది. శోభితని పదే పదే తెలుగు మాట్లాడమని అడిగే వారుట. బేసిక్ గా శోభిత తెలుగు అమ్మాయి అయినా నార్త్ కల్చర్ కు అలవాటులోనే ఎక్కువగా పెరిగింది.
తండ్రి నేవీ ఎంప్లాయ్ కావడంతో అమ్మడి చదువు అంతా వైజాగ్, ముంబైలోనే సాగింది. అలా ఎక్కువగా ఇంగ్లీష్, హిందీ భాషలకు అలవాటు పడిన అమ్మాయి. తెలుగు మాట్లాడటం వచ్చినా రేర్ గానే మాట్లాడేది. శోభిత టాలీవుడ్ లో ఎంటర్ అయిన క్రమంలోనూ తెలుగులో మాట్లాడింది చాలా తక్కువ. దీంతో అమెని అంతా నార్త్ బ్యూటీ అనుకునే వారు. కానీ చైతన్య ఆమెలోని తెలుగును తట్టి లేపాడు. శోభిత అలా తెలుగు మాట్లాడటంతోనే చైతన్య ఆమె ప్రేమలోనూ పడిపోయాడు.
అంతేనా? ఇద్దరు ఒకరికొకరు గోరింటాకు కూడా పెట్టుకున్నారు. గోరింటాకు అన్నది తెలుగు కల్చర్ లో ఓ భాగం. అమ్మాయిల చేతికి గోరింటాకు పండింతే ఆ చేతులు మరింత అందంగా..ప్రత్యేకంగా కనిపిస్తాయి. అలా శోభిత గోరింటాకు చైతన్యని ఆకర్షితుడిని చేసిందేమో.