#SoChay వెడ్డింగ్.. చాలా ముందే కొడుకు కోడలికి నాగ్ గిఫ్ట్!
ఒకే సీజన్ లో ఒకేసారి ఈ ప్రకటనలు రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవ్. ఈ పెళ్లి వేడుకల్ని అక్కినేని కుటుంబం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.
అక్కినేని ఇంట పెళ్లి భాజాల గురించి అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అక్కినేని నాగచైతన్య- శోభిత జంట పెళ్లితో పాటు అక్కినేని అఖిల్- జైనాబ్ రావ్ జీ పెళ్లి గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒకే సీజన్ లో ఒకేసారి ఈ ప్రకటనలు రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవ్. ఈ పెళ్లి వేడుకల్ని అక్కినేని కుటుంబం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.
ఇంకా చెప్పాలంటే అంబానీ ఇంట పెళ్లి తర్వాత దేశంలో అత్యంత ఆసక్తిగా ప్రజలు ఎదురు చూసే పెళ్లి ఇది. ఇక పెళ్లికి ముందే నాగచైతన్య - శోభిత జంట ఖరీదైన కానుకలు అందుకుంటున్నారు. తొలిగా కోడలు శోభితకు కాబోయే మామగారైన నాగార్జున అద్భుతమైన కార్ ని కానుకిచ్చాడు. నాగ్ ఇటీవలే లెక్సస్ LMని కొనుగోలు చేసారు. దీనికోసం 2.5 కోట్లు వెచ్చించారు. అయితే ఈ కార్ ని చై-శోభితకు కానుకగా ఇచ్చారని తెలుస్తోంది. అంతేకాదు శోభిత కోసం భారీగా ఆభరణాలను నాగ్ కొనుగోలు చేసారని సమాచారం.
శోభితా ధూళిపాళ, నాగ చైతన్యల పెళ్లికి సంబంధించిన అప్‌డేట్‌లతో ఇంటర్నెట్ అంతకంతకు వేడెక్కుతోంది. తదుపరి అఖిల్ పెళ్లి కోసం నాగార్జున భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారని, ఆ పెళ్లికి రాజకీయ సినీరంగాలతో పాటు పారిశ్రామిక రంగాల నుంచి భారీగా అతిథులు వస్తారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
డిసెంబర్ 4న హైదరాబాద్‌లో చైతన్య, శోభిత వివాహం జరగనుంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలను స్టైల్‌గా ప్రారంభించారు. శుక్రవారం శోభిత వధూ స్నానానికి సంబంధించిన మొదటి విజువల్స్ ఆన్‌లైన్‌లో విడుదలయ్యాయి. చైతన్య నటిస్తున్న `తండేల్` విడుదలకు రావాల్సి ఉంది.