తండేల్ టీమ్ తప్పుగా ఆలోచిస్తుందా?

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య.. ప్రస్తుతం తండేల్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-24 05:43 GMT

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య.. ప్రస్తుతం తండేల్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. కార్తికేయ-2 సినిమాకు గాను ఇటీవల నేషనల్ అవార్డు అందుకున్న చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన కొందరు మత్స్యకారుల జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. అలాగే ఇందులో మంచి ప్రేమ కథ కూడా హైలెట్ కానుంది.

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. లవ్ స్టోరీ మూవీ తర్వాత మరోసారి చైతూ, సాయి పల్లవి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మేకర్స్ శరవేగంగా తండేల్ షూటింగ్ ను కంప్లీట్ చేస్తున్నారు. త్వరలోనే గుమ్మడికాయ కొట్టనున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా సినిమాపై ఆడియన్స్ లో వేరే లెవెల్ బజ్ క్రియేట్ అయింది. కచ్చితంగా మూవీ మంచి హిట్ అవుతుందని ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు.

అయితే తండేల్ రిలీజ్ ఎప్పుడనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ అవుతుందని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. గేమ్ ఛేంజర్ కూడా పోస్ట్ పోన్ అవ్వడంతో అప్పుడే రిలీజ్ అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. అప్పటికి సెన్సార్ పూర్తి అయ్యే ఛాన్స్ లేదని.. అందుకే సంక్రాంతికి తండేల్ ను రిలీజ్ చేయనున్నారని కొద్దిరోజులుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

దీంతో సినీ ప్రియులు ఖుషీ అయ్యారు. ఎందుకంటే సంక్రాంతికి వచ్చే సినిమాలపై కచ్చితంగా అందరి ఫోకస్ ఉంటుంది. సినీ ప్రియులంతా థియేటర్లకు తరలివెళ్తారు. దానికి తోడు మిగతా సినిమాలతో పోలిస్తే.. తండేల్ పై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. కాబట్టి సంక్రాంతికి తండేల్ రావడం కరెక్టని అంతా అనుకున్నారు. ఇప్పటికే పొంగల్ బరిలో రావాలని ఫిక్స్ అయిన స్టార్ హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పై అనుకున్న స్థాయిలో ఆడియన్స్ లో బజ్ లేదని చెప్పాలి.

బాలయ్య 109 మూవీ వస్తున్నా.. సంక్రాంతికి అలాంటి మాస్ సినిమా ఉండాల్సిందే. వెంకటేష్, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. దానిపైన కూడా ఇప్పటివరకు పెద్దగా హైప్ లేదు. ఒకవేళ రిలీజ్ అయినా తండేల్ కు ఎలాంటి ఢోకా లేదు. కాబట్టి తండేల్.. సంక్రాంతికి రిలీజ్ అయితే తిరుగలేదని అంతా భావిస్తున్నారు. కానీ మేకర్స్ ఇంకా అనౌన్స్ చేయడం లేదు. అదే సమయంలో నెట్టింట ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతోంది. పొంగల్ డేట్ ను తండేల్ మేకర్స్ పక్కన పెట్టారని తెలుస్తోంది.

రిపబ్లిక్ డే లేదా వాలెంటైన్స్ డే కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ఆలోచిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. తండేల్ టీమ్ తప్పుగా ఆలోచిస్తుందని చెబుతున్నారు. సంక్రాంతికి మించిన బెస్ట్ సీజన్ ఇంకొకటి లేదుగా అని అంటున్నారు. మంచి బజ్ ఉన్న తండేల్ మూవీ సంక్రాంతికే రావాలని కామెంట్లు పెడుతున్నారు. పొంగల్ సీజన్ ను మిస్ చేసుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారు. తండేల్ కు మంచి వైబ్స్ ఉన్నాయని, అందుకే సరైన నిర్ణయం తీసుకోవాలని మేకర్స్ కు సూచిస్తున్నారు. మరి తండేల్ మేకర్స్ ఏం చేస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News