వాళ్లతో ఫైట్.. వారసుడు మీసం తిప్పుతాడా..?

2025 సంక్రాంతికి ఇప్పటికే సినిమాల రిలీజ్ షెడ్యూల్ లు జరుగుతున్నాయి.

Update: 2024-09-20 10:30 GMT

2025 సంక్రాంతికి ఇప్పటికే సినిమాల రిలీజ్ షెడ్యూల్ లు జరుగుతున్నాయి. ముందుగా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ లాక్ చేశారు. వశిష్ఠ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా గ్రాండ్ విజువల్ ట్రీట్ తో రాబోతుంది. ఈ సినిమాలో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్మెంట్ తో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటుగా నందమూరి బాలకృష్ణ 109వ సినిమా కూడా సంక్రాంతి టార్గెట్ తో వస్తుందని తెలుస్తుంది.

N.B.K109 సినిమాను కె ఎస్ బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. సితార బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతెలా హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఇక సంక్రాంతికి నేను కూడా వస్తానని అంటున్నాడు విక్టరీ వెంకటేష్. సూపర్ హిట్ డైరెక్టర్ అనీల్ రావిపుడి డైరెక్షన్ లో వెంకటేష్ లీడ్ రోల్ లో దిల్ రాజు నిర్మాతగా సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా టైటిల్ కూడా సంక్రాంతికి వస్తున్నాం అని పెట్టబోతున్నారని టాక్.

2025 సంక్రాంతికి దాదాపు ఈ మూడు సినిమాలు రిలీజ్ కన్ ఫర్మ్ కాగా సంక్రాంతికి సీనియర్ స్టార్స్ తో పోటీ పడేందుకు వస్తున్నాడు అక్కినేని వారసుడు నాగ చైతన్య. అసలైతే సంక్రాంతికి కింగ్ నాగార్జున సినిమా కూడా వస్తే సీనియర్ స్టార్స్ నలుగురి సినిమాల మధ్య ఆసక్తికరమైన పోటీ ఉండేది. కానీ నాగార్జున బదులు నాగ చైతన్య ఈ రేసులో నిలబడుతాడని లేటెస్ట్ టాక్.

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న తండేల్ సినిమాను చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నారు. కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్ తో తండేల్ వస్తుంది. ఈ సినిమాను అసలైతే ఈ ఇయర్ డిసెంబర్ రిలీజ్ అనుకున్నా చరణ్ గేమ్ ఛేంజర్ క్రిస్ మస్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి తండేల్ ని వాయిదా వేయాలని ఫిక్స్ అయ్యారు. మరీ ఎక్కువ టైం కాకుండా సంక్రాంతికి నాగ చైతన్య తండేల్ ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే మాత్రం సీనియర్ హీరోలతో అక్కినేని యువ హీరో పోటీకి సిద్ధం అని చెప్పొచ్చు.

Tags:    

Similar News