పిక్ టాక్: చైతూ పెళ్లిలో కజిన్స్ సందడే సందడి!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ.. వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.

Update: 2024-12-05 09:19 GMT

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ.. వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. అక్కినేని కుటుంబ వారసత్వంలో ఒక్కటైన హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. టెంపుల్ థీమ్ సెటప్‌ తో సంప్రదాయ పద్ధతిలో బుధవారం అర్థరాత్రి వరకు చైతూ, శోభిత వివాహ వేడుక కొనసాగింది.

స్టూడియోలోని అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా చైతూ.. శోభిత మెడలో వేదమంత్రాల సాక్షిగా మూడు ముళ్ళు వేశారు. మొత్తానికి అక్కినేని వారసుడి పెళ్లి.. తెలుగు సంప్రదాయాలకు అద్దంపట్టేలా జరిగిందనే చెప్పాలి. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

అయితే వివాహ వేడుకకు ముందు.. వరుడు నాగ చైతన్య కజిన్స్ ఫుల్ గా సందడి చేశారు. ఓ రేంజ్ లో నవ్వుకుని చిల్ అయ్యారు. ఆ తర్వాత అంతా కలిపి క్రేజీ పిక్స్ కు పోజు ఇచ్చారు. ఆ ఫోటోను టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి సతీమణి మిహీక బజాజ్ పోస్ట్ చేశారు. చైతూ సింగిల్ పిక్ ను కూడా షేర్ చేశారు. పెళ్ళి కొడుకు అంటూ లవ్ ఇమోజీ కాప్షన్ ఇచ్చారు.

ఇక గ్రూప్ పిక్ లో నాగ చైతన్య, సుమంత్, సుశాంత్, రానా దగ్గుబాటి, మిహీక, సుశాంత్ సోదరీమణులు, వెంకటేష్ కుమార్తెలతో పాటు మరికొందరు అక్కినేని, దగ్గుబాటి పిల్లలు ఉన్నారు. ఫోటోలో అంతా నవ్వుతూ కనిపించారు. చైతూను సరదాగా ఆట పట్టిస్తున్నట్లు ఉన్నారు. మొత్తానికి పిక్ లో కొత్త పెళ్లి కొడుకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

అదే సమయంలో మిహీక షేర్ చేసిన గ్రూప్ పిక్.. నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఫోటో సూపర్ అని అంతా కామెంట్లు పెడుతున్నారు. కజిన్స్ బెస్ట్ మూమెంట్ అని చెబుతున్నారు. చైతూ ముఖంలో పెళ్లి కళ ఉట్టి పడుతుందని అంటున్నారు. బ్యూటిఫుల్ పిక్ అని కాప్షన్ ఇస్తున్నారు. పిక్ ను వైరల్ చేసి ట్రెండ్ చేస్తున్నారు.

అయితే మరికొద్ది రోజుల్లో మరోసారి అలాంటి మూమెంట్ అక్కినేని ఫ్యామిలీలో రిపీట్ కానుందన్న విషయం తెలిసిందే. అక్కినేని అఖిల్ పెళ్లి వచ్చే ఏడాది జరగనుంది. రీసెంట్ గా జైనబ్ రవ్జీ తో అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగింది. వచ్చే ఏడాది అఖిల్ పెళ్లి జరగనున్నట్లు ఇటీవల నాగార్జున తెలిపారు. అఖిల్, జైనబ్ వివాహం కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే జరగనున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో వేచి చూడాలి.

Tags:    

Similar News