రక్తంతో నుదుటి నామాలు.. బ్యాడ్ బోయ్ కార్తీక్ ఇంప్రెసివ్..!

కెరీర్ లో వరుస ఫ్లాపులతో కాస్త అటు ఇటుగా ఉన్న నాగ శౌర్య తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో వచ్చాడు.

Update: 2025-01-22 05:40 GMT

యువ హీరో నాగ శౌర్య తన లేటెస్ట్ సినిమా అప్డేట్ తో సర్ ప్రైజ్ చేశాడు. కెరీర్ లో వరుస ఫ్లాపులతో కాస్త అటు ఇటుగా ఉన్న నాగ శౌర్య తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో వచ్చాడు. నేడు నాగ శౌర్య పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా పోస్టర్ వదిలారు. రామ్ దేసిన (రమేష్) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్ లో శ్రీనివాస రావు చింతలపూడి నిర్మిస్తున్నారు. నాగ శౌర్య ఈసారి బ్యాడ్ బోయ్ కార్తీక్ గా రాబోతున్నాడు.


ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఇది మాస్ సినిమా అని హింట్ ఇచ్చాడు. వ్యాన్ వెనక భాగంలో నాగ శౌర్య నుదుటి మీద రక్తపు నామాలు చేతికి రక్తపు మరకలతో ఇంటెన్స్ లుక్ తో కనిపించాడు. ఈ పోస్టర్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించాడు డైరెక్టర్. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే బ్యాడ్ బోయ్ కార్తీక్ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది అని అర్థమవుతుంది. నాగ శౌర్య లుక్ అదిరిపోయింది.

ఈ సినిమాలో నాగ శౌర్య సరసన ఏద హీరోయిన్ గా నటిస్తుంది. ఇక సినిమాలో సముద్రఖని, నరేష్ వీ.కే, సాయి కుమార్, వెన్నెల కిషోర్, శ్రీదేవి విజయ్ కుమార్ లు కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం సినిమాటోగ్రాఫర్ గా రసూల్ ఎల్లోర్ పనిచేస్తున్నాడు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ హారిస్ జైరాజ్ బ్యాడ్ బోయ్ కార్తీక్ కోసం మ్యూజిక్ అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి కావొచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో ప్రమోషన్స్ మొదలు పెట్టారు చిత్ర యూనిట్.

కొన్నాళ్లుగా కెరీర్ లో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగ శౌర్యకి ఈ సినిమా సూపర్ హిట్ అందిస్తుందా లేదా అన్నది సినిమా వస్తేనే కానీ చెప్పలేం. నాగ శౌర్య మాత్రం ఈసారి బ్యాడ్ బోయ్ కార్తీక్ తో కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తున్నాడు. నాగ శౌర్య రామ్ దేసిన కాంబో ప్రేక్షకులకు ఎలాంటి సినిమా అందిస్తుంది అన్నది చూడాలి.

Tags:    

Similar News