దుబాయ్‌లో దేవర కాస్ట్‌లీ పార్టీ
జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగ వంశీ.. ఇప్పుడు దుబాయ్‌లో డిస్టిబ్యూటర్లకు కూడా పార్టీని ఇచ్చారు.
'దేవర' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ కోస్టల్ ఏరియా బ్యాగ్‌డ్రాప్‌తో హై లెవెల్ యాక్షన్‌తో రూపొందింది. దీంతో ఇది పాన్ ఇండియా రేంజ్‌లో ప్రభావం చూపించింది. క్రేజీ యాక్షన్‌తో రూపొందిన 'దేవర' సినిమాకు మొదట్లో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం భారీ స్థాయిలో లభించింది.
ఫలితంగా ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లను సాధించి సత్తా చాటింది. దీంతో క్లీన్ హిట్ స్టేటస్‌ను సైతం సొంతం చేసింది. ఇలా ఈ చిత్రం రికార్డు రన్‌తో లాభాలను కూడా అందుకుంటోంది. ఫలితంగా ఈ చిత్రాన్ని కొన్న వాళ్లంతా సంతోషంగా ఉన్నారు..'దేవర' సినిమాకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ హక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నాగ వంశీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
తర్వాత ఆయన ఈ రైట్స్‌ను వేరే బయ్యర్లకు అమ్మేశారు. ఇక, ఈ సినిమా అందరికీ లాభాలను అందించడంతో కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లో నాగ వంశీ సక్సెస్ పార్టీని ఇచ్చారు. దీనికి చిత్ర యూనిట్ మాత్రమే హాజరు అయింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగ వంశీ.. ఇప్పుడు దుబాయ్‌లో డిస్టిబ్యూటర్లకు కూడా పార్టీని ఇచ్చారు.
ఈ సినిమాను కొన్న బయ్యర్లు అందరినీ తన ఖర్చులతో దుబాయ్ తీసుకు వెళ్లిన ఆయన.. అక్కడ అదిరిపోయే రీతిలో పార్టీని ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి నిర్మాత నాగ వంశీ 'దేవర' సినిమాను కొన్న వాళ్లంతా హ్యాపీగా ఉన్నారని, ఈ కలెక్షన్లు జెన్యూన్‌గా చెప్పినవే అని పేర్కొన్నారు.
అయినప్పటికీ కొందరు మాత్రం ఈ సినిమా బయ్యర్లు మాత్రం సంతోషంగా లేరని ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నాగ వంశీ వాళ్లకు సక్సెస్ పార్టీ ఇవ్వడం.. వాళ్లంతా సంతోషంగా పాల్గొనడం చూసిన వాళ్లంతా ఈ ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక, కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమా మూడు వారాల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 250 కోట్లు షేర్‌తో పాటు రూ. 520 కోట్లు వరకూ గ్రాస్ వసూలు చేసింది. అంతేకాదు, అన్ని భాషల్లోనూ ఇధి లాభాలను అందుకుంది. తద్వారా ఇది పాన్ ఇండియా రేంజ్ హిట్‌గా నిలిచింది.