మోక్షజ్ఞ రెండో మూవీ.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ.. సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-12-27 10:05 GMT

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ.. సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. హనుమాన్ మూవీతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తన డెబ్యూ మూవీ చేస్తున్నారు మోక్షు. ఇప్పటికే ఆయన బర్త్ డే సందర్భంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.

సెప్టెంబర్ లో మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. భారతీయ పురాణ ఇతిహాసాల బ్యాక్ డ్రాప్ తో సినిమా ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. బాలయ్య కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. అయితే డిసెంబర్ 5వ తేదీన మోక్షు డెబ్యూ మూవీ పూజా కార్యక్రమాలు జరగాల్సి ఉన్నా.. అవ్వలేదు.

ఆ సమయంలో పలు రూమర్లు చక్కర్లు కొట్టగా.. మోక్షజ్ఞకు హెల్త్ బాలేదని అందుకే పూజా కార్యక్రమాలు జరగలేదని బాలయ్య తెలిపారు. త్వరలోనే జరుగుతాయని చెప్పారు. అయితే మోక్షజ్ఞ రెండో మూవీ ఫిక్స్ అయిపోయినట్లు కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికే నిజమేనని నెటిజన్లు అంటున్నారు.

రీసెంట్ గా లక్కీ భాస్కర్ తో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి డైరెక్షన్ లో మోక్షజ్ఞ నటించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ గురించి డిస్కషన్స్ జరిగిపోయాయని సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ.. వెంకీ అట్లూరి- మోక్షజ్ఞ సినిమాను గ్రాండ్ గా నిర్మించనున్నారని టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఈ విషయంపై నాగవంశీ రెస్పాండ్ అయ్యారు. వెంకీ అట్లూరిపై బాలకృష్ణకు గట్టి నమ్మకం ఉందని, అందుకే ఆ ప్రాజెక్ట్‌ ను ఓకే చేశారని తెలిపారు. లక్కీ భాస్కర్ స్పెషల్ స్క్రీనింగ్ చూస్తున్నప్పుడు, బాలయ్య వెంకీ అట్లూరితో మోక్షజ్ఞ చిత్రాన్ని ధృవీకరించారని తెలిపారు. డైరెక్టర్ పనితనాన్ని బాలకృష్ణ ప్రశంసించినట్లు తెలిపారు.

వెంకీ టేకింగ్ పై తనకు ఎలాంటి డౌట్ లేదని బాలయ్య చెప్పినట్లు నాగవంశీ పేర్కొన్నారు. మోక్షు వివిధ జోనర్లలో చిత్రాలు చేయాలని ఆసక్తితో ఉన్నట్లు తెలిపారు. మొత్తానికి నాగవంశీనే మోక్షు రెండో సినిమాను నిర్మించనున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. అయితే ఇప్పుడు బాలయ్య డాకు మహరాజ్ ఆయన నిర్మాణంలోనే రెడీ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు తండ్రి.. తర్వాత కొడుకు అన్నమాట.

Tags:    

Similar News