నాగబంధం: ముసలితో తలపడే సాహస వీరుడు
తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. పెద్ద కాపు ఫేమ్ విరాట్ కర్ణ ముసలితో పోరాడే వీరుడు.
నీటిలో ముసలితో పోరాడాలంటే సింహం, ఏనుగు కూడా సరిపోవు. బలమైన అడవి దున్నలను కూడా మట్టికరిపించేస్తుంది ముసలి. అంతటి బలశాలి అయిన జలచరంతో పోరాడాలంటే నిజంగా వీరాధివీరుడే అయ్యి ఉండాలి. చూస్తుంటే.. ఇక్కడ వీరుడు మొసలితో భీకరమైన పోరాటం చేస్తున్నాడు. ఇది ఇంతకీ ఏ సినిమాలో సీన్? అంటే... అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న నాగబంధం చిత్రంలోనిది ఈ దృశ్యం. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. పెద్ద కాపు ఫేమ్ విరాట్ కర్ణ ముసలితో పోరాడే వీరుడు.
అడ్వెంచర్ థ్రిల్లర్ నాగబంధంలోమ కర్ణ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. అభిషేక్ నామా దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ - NIK స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కిషోర్ అన్నపురెడ్డి నిర్మాత. ఫస్ట్ లుక్‌ను రానా దగ్గుబాటి విడుదల చేశారు. ముసలితో తలపడడం అంటే గొప్ప సాహసం. అలాంటి సాహసాన్ని, విరోచిత పోరాటాన్ని అభిషేక్ తెరపై చూపించే ప్రయత్నం చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రంలో సముద్రంలో ముసలితో హీరో తలపడే దృశ్యం ఆకట్టుకుంటుందని సమాచారం. తాజా పోస్టర్ లో 6-ప్యాక్ యాబ్స్‌తో వీరుడిగా విరాట్ కర్ణ లుక్ ఆకర్షిస్తోంది. నీటి అడుగున ముసలితో భారీ యాక్షన్ సీక్వెన్స్ లో పోరాటం ఒళ్లు ఝలదరించేలా తెరకెక్కించారని తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా 108 విష్ణు దేవాలయాలలో దాగి ఉన్న నిధి చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. `ది సీక్రెట్ ట్రెజర్` అనేది ఈ మూవీ ట్యాగ్‌లైన్. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. దీనికి సౌందర్ రాజన్ ఎస్ సినిమాటోగ్రఫీ, అభే సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ ఏడాదిలోనే విడుదలకానుంది.